టీడీపీలో ఒక కీలక ఘట్టానికి పార్టీ అధినేతగా చంద్రబాబు తెరదించారు. పార్లమెంటు జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ ఘట్టానికి చంద్రబాబు మగింపు పలికారు. దాదాపు ముందునుంచి అనుకున్నట్టుగానే.. అంచనా లప్రకారమే నాయకులను సిద్ధం చేశారు. వీరిలో కొందరు.. వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. మరికొందరు గత ఎన్నిక లలో ఓడిన వారు..గెలిచిన వారు కూడా ఉన్నారు.
ఇదేసమయంలో ఆశావహులు కూడా ఉన్నారు. మొత్తానికి పార్లమెంటు జిల్లాలకు అధ్యక్షులను నియమిం చారు. ఇదిలావుంటే.. నెక్ట్స్ ఏంటి? అనేది ప్రశ్న. ప్రస్తుతం చంద్రబాబు మూడు కీలక లక్ష్యాలను పెట్టుకు న్నారు. 1) వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపరేషన్: వచ్చే ఎన్నికలు మూడేళ్ల తర్వాత కానీ.. జరగవు. అయితే .. ఇప్పటి నుంచే చంద్రబాబు వీటికి సిద్ధం అవుతున్నారు. ఎంత లేదని అనుకున్నా.. కాదని అనుకున్నా.. వైసీపీ గుర్రం ఎగిరితే? అనే సందేహం తరచుగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ నాయకులను వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచేప్రిపేర్ చేసే బాధ్యతలను పార్లమెం టు నియోజకవర్గం అధ్యక్షులకు అప్పగిస్తారు. 2) ప్రజలతో కనెక్టివటీ..: నిజానికి ఇతర పార్టీల కంటే కూడా .. టీడీపీతోనే ప్రజలకు ఎక్కువగా కనెక్టివిటీ ఉందన్నది వాస్తవం. వైసీపీ కంటే కూడా.. టీడీపీతోనే ప్రజలకు అనుబంధం ఎక్కువ. అయినా.. ఇది చాలదన్నది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినా.. పార్టీ తరఫున ప్రజలను కలవాలని చెప్పినా.. ఆయన ఉద్దేశం వచ్చే ఎన్నికలే.
3) కూటమి బలం: ప్రస్తుతం ఉన్న కూటమి వచ్చే 15 సంవత్సరాలు కొనసాగాలన్నది లక్ష్యం. ఈ నేప థ్యంలో పైస్థాయిలో అధినాయకుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కలివిడి.. చాలా కీలకం. 2024 ఎన్నికల సమయంలో ఇలానే.. కలివిడిగా ఉండి ముందుకు సాగారు. కానీ.. ఇప్పుడు కొన్ని కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు కూడా పార్లమెంటు స్థాయిలోనే ప్రయత్నించ నున్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కూడా వీరిపైనే పెట్టనున్నారు. మొత్తంగా కమిటీలు వేయడమే కాదు.. నెక్ట్స్ బాధ్యతల విషయంలోనూ చంద్రబాబు పక్కా క్లారిటీతోనే ఉన్నారు.