కేసీఆర్‌ను నేను కానీ.. మా ప్రభుత్వం కానీ.. బంధించాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆయనే బంధించుకున్నారు.`` అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ చుట్టూ పోలీసులు ఉన్నారని.. లోపల కేసీఆర్ బిక్కుబిక్కుమంటూ ఉన్నారని.. ఇంతకన్నా బంధీ ఎందుకని ప్రశ్నించారు. చర్లపల్లి, చెంచల్ గూడ జైళ్లలోనూ ఇంతకన్నా.. బంధీ ఉండదని వ్యాఖ్యానించారు. తనను కెలకవద్దని.. కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా నోరు పారేసుకుంటే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ఏముందని గర్వం.. ?
కేసీఆర్‌కు గర్వం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిందపడ్డా పైచేయి నాదే అనే టైపులో కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారని అన్నా రు. కానీ, వాస్తవం ప్రకారం.. పార్లమెంటు ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చామని.. పంచాయతీ ఎన్నికల్లోనూ చావు దెబ్బ తీశామ ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోనూ అడ్రస్ లేకుండా చేశామన్నారు. కంటోన్మెంటు లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. పంచాయతీల్లో 8335 మంది సర్పంచులను గెలిపించుకున్నామని తెలిపారు. ఇన్ని పరాజయాలు ఎదురైనా కేసీఆర్‌కు ఏమాత్రం జ్ఞానం రావడం లేదని.. ఇంకా తనదే పైచేయి అని భ్రమల్లో బతుకుతున్నార ని రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీకి రండి
మీడియా ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పడం కాదని.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు సూచించారు. మరో నాలుగు రోజుల్లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని.. ఈ సమావేశాలకు రావాలని ఆయన కోరారు. అక్కడ అన్ని విషయాలపైనా చర్చించుకుందామన్నారు. ప్రతి అంశంపైనా ఆధారాలతో సహా సమాధానం చెబుతామ న్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చించకుండా.. ఫామ్ హౌస్‌లో పడుకుని.. సమయం చూసుకుని మీడియా ముందుకు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలైన చర్చలు కావాలంటే.. అసెంబ్లీకి రావాలని.. అప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. రాష్ట్ర ప్రజలు చూస్తారని.. సీఎం వ్యాఖ్యానించారు.