బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ(ఆమె రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు) కవిత.. పార్టీని ప్రకటించేశారు. ఆమె బీఆర్ ఎస్‌తో విభేదించి.. డియర్ డాడీ లేఖ రాసినప్పటి నుంచి మారుతున్న పరిణామాలు.. పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం.. కేసీఆర్‌ను తొలుత దేవుడు అంటూ.. తర్వాత.. ఆయననే నేరుగా విమర్శించడం వంటి అంశాలతో పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆమె జాగృతి జనం యాత్ర పేరుతో ప్రజల మధ్యకు వచ్చారు.
ఈ సమయంలో ఆమె పార్టీ `తెలంగాణ జాగృతి`యేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీరి అంచనాల మేరకే.. కవిత.. తెలంగాణ జాగృతి పార్టీ(టీజేపీ)ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఈ విషయాన్ని తాజాగా కవిత స్వయంగా మండలిలోనే ప్రకటించారు. ఇక, ప్రజల మధ్యే తన జీవితం ఉంటుందన్నారు. దీంతో కవిత పూర్తిస్థాయిలో సొంత పార్టీ పెట్టుకునే విషయం పై ఒక క్లారిటీ వచ్చేసింది.
అనేక మంది..!
ఇక, రాజకీయాల్లో వచ్చి కొత్గ పార్టీ పెట్టుకోవడం.. తెలంగాణలో చాలా మంది చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న షర్మిల కూడా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించా రు.కానీ, సక్సెస్ కాలేక పోయారు. ఇక, దీనికి ముందు విజయశాంతి, ఆలి నరేంద్ర, ప్రొఫెసర్ కోదండరాం లు కూడా సొంత పార్టీలు పెట్టుకున్నారు. కానీ, సక్సెస్ కాలేదు.
ఈ పరంపరలో ఇప్పుడు కవిత కూడా.. సొంత పార్టీ స్థాపించనున్నారు. ఇక, ఇప్పటికే తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) కూడా సొంత పార్టీ పెడతానని ఇటీవల ప్రకటించుకున్నారు. అయితే.. సొంత పార్టీ పెట్టడం తేలికే కావొచ్చు. మహా అయితే..రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, దానిని ప్రజలకు చేరువ చేయడం.. ప్రజల ఆశీర్వాదం పొందడం అనేదే కీలకం. ఈ విషయంలో కవిత ఎలాంటి వ్యూహాలు వేస్తారు? ఎలా ముందుకు సాగుతారు? అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. బీఆర్ ఎస్ కీలక ఓటు బ్యాంకునే తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.