తన వివాదాస్పద వ్యాఖ్యలతో మాజీ మంత్రి రోజా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తాజాగా ఏపీ పోలీసులపై రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలేసి పచ్చ చొక్కాలు వేసుకోవాలని, నీళ్లు లేని బావిలో పోలీసులు దూకాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది అని ఎందుకు పోలీసులకు వచ్చిన 36వ ర్యాంకే నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఆ ర్యాంకు చూసి సిగ్గు తెచ్చుకోవాలని, లేదంటే నీళ్లు లేని బావిలో దూకి చావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.