ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్యూటీ అంటే వినిపించే ఏకైక పేరు శ్రీలీల. తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో, చురుకైన నటనతో కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకున్న ఈ ‘పెళ్లి సందడి’ భామ, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సాధారణంగా హీరోయిన్లకు తమ తోటి స్టార్ హీరోల మీదో లేదా టాలీవుడ్ లెజెండ్స్ మీదో అభిమానం ఉండటం సహజం. కానీ, శ్రీలీల మాత్రం తన ఫేవరెట్ హీరో విషయంలో అందరికీ షాకిచ్చేలా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.
శ్రీలీల ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్‌తో పని చేస్తున్నప్పటికీ, తన మోస్ట్ ఫేవరెట్ హీరో మాత్రం టాలీవుడ్‌లో లేరని ఈ ముద్దుగుమ్మ తేల్చి చెప్పేసింది. తనకు చిన్నప్పటి నుండి తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే అమితమైన ఇష్టమని మనసులో మాట బయటపెట్టింది.
ప్రస్తుతం శ్రీలీల తన తమిళ డెబ్యూ మూవీ `పరాశక్తి` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం పొంగల్ కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల.. తాను అజిత్ కుమార్ కు వీరాభిమానిని అని స్పష్టం చేసింది. కేవలం నటుడిగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలో అజిత్ గారు పాటించే క్రమశిక్షణ, ఆయన సరళత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. అజిత్ సినిమాలో కనీసం ఒక చిన్న పాత్ర దొరికినా వదులుకోనని పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మరి భవిష్యత్తులో ఈ 'అజిత్ ఫ్యాన్' తన ఆరాధ్య దైవంతో కలిసి జోడీ కడుతుందో లేదో చూడాలి.