పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన సునామీని మళ్ళీ మొదలుపెట్టారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ ఎంటర్టైనర్ `ది రాజా సాబ్` థియేటర్లలోకి రాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అసలైన వినోదాన్ని పంచేందుకు జనవరి 9న వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఓ అరుదైన మైలురాయిని అధిగమించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి యూఎస్ మార్కెట్ కలెక్షన్లే నిదర్శనం. ది రాజా సాబ్ సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. విశేషమేమిటంటే, ఇంకా ప్రీమియర్స్ కూడా ప్రారంభం కాకముందే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం రెబల్ స్టార్ రేజ్‌కు నిదర్శనం. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, డే 1 నాటికి ఈ లెక్కలు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
కాగా, మారుతి ఈ చిత్రాన్ని ఒక గ్రాండ్ ఫాంటసీ వండర్‌గా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా డార్లింగ్‌ను చూసిన అభిమానులకు, ఈ సినిమాలో సరికొత్త హారర్-కామెడీ టచ్ ఉన్న వింటేజ్ ప్రభాస్ కనిపించబోతున్నారు. దీనికి తోడు ఎస్.ఎస్. థమన్ అందిస్తున్న సంగీతం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తుండటం ఈ గ్లామర్ హంగామాను మరింత పెంచింది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న రాజా సాబ్, అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టేసింది. ఇక థియేటర్లలో బొమ్మ పడితే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రాంపేజ్ ఆడిస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.