పెద్ద సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు విషయమై తెలంగాణలో తరచుగా పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా టైంలో చోటు చేసుకున్న విషాదం తర్వాత ప్రభుత్వమే రేట్ల పెంపు విషయంలో వెనుకంజ వేసింది. కానీ గత ఏడాది సెలక్టివ్‌గా కొన్ని సినిమాలకు రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించారు. అప్పుడు దీనికి వ్యతిరేకంగా కోర్టు కేసులు పడ్డాయి. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటికి రెండుసార్లు ఇకపై రేట్ల పెంపు ఉండదని ప్రకటన చేయడం తెలిసిందే.
అయినా సంక్రాంతికి వచ్చేసరికి మళ్లీ రేట్ల పెంపుకోసం రెండు పెద్ద సినిమాల నిర్మాతలు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నిర్మాతలు ముందే కోర్టుకు వెళ్లి రేట్ల పెంపుకు ఇబ్బంది లేకుండా ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు. దీంతో జీవోల విషయంలో ఏ ఇబ్బందీ ఉండదనే అÙతా అనుకున్నారు. అయినా రాజాసాబ్ సినిమాకు జీవో రావడంలో బాగా ఆలస్యం జరిగింది. ఎక్స్‌ట్రా రేట్లతో పెయిడ్ ప్రిమియర్స్ పడలేదు. ఉదయం నుంచి రేట్ల పెంపు వర్తించింది.
కానీ సాయంత్రానికి మళ్లీ కథ మారిపోయింది.రేట్ల పెంపుపై మళ్లీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పడగా.. దీన్ని విచారించిన అనంతరం రాజాసాబ్ మూవీకి టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు సస్పెం సస్పెండ్ చేసింది. స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి ఇకపై రేట్ల పెంపు ఉండదని ప్రకటన చేశాక కూడా మళ్లీ ఎందుకు ఎక్స్‌ట్రా రేట్లు ఇస్తూ జీవోలు జారీ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 20 సంవత్సరాల కింద హైదరాబాద్ మొత్తం ఒకే టికెట్ ధర ఉండేదని.. తాము కూడా సినిమాలకు వెళ్ళామని.. తమకు టికెట్ ధరలు తెలుసని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజాసాబ్‌కు అదనపు రేట్లు తీసేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఐతే వీకెండ్ వరకు ఆల్రెడీ అయిపోయిన బుకింగ్స్ విషయంలో ఏం చేస్తారో తెలియదు. బహుశా వీకెండ్ తర్వాత రేట్లు తగ్గించేస్తారేమో. ఇందుకోసం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశముంది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం రాత్రి మన శంకర వరప్రసాద్‌కు తెలంగాణలోపెయిడ్ ప్రిమియర్స్ సందేహమే. రెగ్యులర్ షోలకు అదనపు రేట్లు కూడా ఉండకపోవచ్చు. ఏపీలో మాత్రం ఈ సినిమాకు పెయిడ్ ప్రిమియర్స్, అదనపు రేట్లకు అనుమతులు వచ్చేశాయి.