ఆ నాలుగు నగరాలు కలిసిపోతాయి: చంద్రబాబు

admin
Published by Admin — January 10, 2026 in Andhra
News Image

అమరావతి రాజధాని నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని చూస్తోన్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని చేయాలని సీఎం చంద్రబాబు ఓ పక్క ప్రయత్నిస్తున్నారు. కానీ, జగన్ మాత్రం ఇంకా అమరావతి మీద విషం చిమ్మడం మానలేదు. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ పడుతున్నారని జగన్, వైసీపీ నేతలకు పరోక్షంగా చంద్రబాబు చురకలంటించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అన్నీ భవిష్యత్తులో కలిసిపోతాయని అన్నారు.

ఆ నగరాలన్నీ కలిసి ఒక అత్యుత్తమ నివాసయోగ్యమైన మహా నగరం ఏర్పడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. రాబోయే 6 నెలల్లో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్ పని చేయడం మొదలవుతుందని వెల్లడించారు. ఇక, పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలాగా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం అమలు చేయాలని అన్నారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఈ పథకం అమలు చేయాలన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు.

Tags
AP CM Chandrababu amaravati 4 cities emerging one big city
Recent Comments
Leave a Comment

Related News