2029 ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయితే.. ఇప్పటి నుంచే వైసీపీ నాయకులు తాము అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. కానీ, సాధారణ ఎన్నికల మాదిరిగా.. అయితే.. 2029 ఎన్నికలు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా.. వైసీపీ.. నాయకులు టీడీపీ లేదా ప్రస్తుత కూటమి నాయకులతో పోరాటం చేస్తున్నారు. వారినే ప్రత్యర్థులుగా చూస్తున్నారు.
కానీ, వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పోరాటం.. ఆ పార్టీ విధానాలతోనే ముడిపడిందని పరిశీలకులు చెబు తున్నారు. కొన్ని చిత్రంగా ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో రియాల్టీని పరిశీలిస్తే.. నిజమేనని అనిపిస్తుంది. ఇలానే వైసీపీ వ్యవహారం కూడా ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి కూడా జగన్ ఇలానే ఉంటే.. ఆయన యాట్టిట్యూడే.. టీడీపీకి కలిసి రానుంది. వైసీపీ భారీ మైనస్ కానుంది!. దీనిలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రజాభీష్టం: ప్రజాభీష్టానికి ఏ పార్టీ అయినా.. తల వంచవలసిందే. ఈ విషయంలో వైసీపీ ఇప్పటి వరకు తనను తాను నిరూపించుకోలేక పోయింది. ప్రజలు కోరుకున్న ఏ ఒక్కటీ చేయలేక పోయింది. అధికారం లో ఉన్నప్పుడు.. మద్యం ధరలను ప్రజలు వ్యతిరేకించారు. చెత్తపై పన్నును ఎత్తేయాలని ఉద్యమాలు చేశారు. మూడు రాజధానులు వద్దన్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని రైతులు సహా గ్రామీణులు ఉద్యమించారు. కానీ, జగన్ వినిపించుకోలేదు. ఇప్పటికీ మారలేదు.
ఇదే వైసీపీ ప్రధాన శత్రువుగా మారనుంది.. అదే సమయంలో ఉద్యోగులను వేధించారన్న ముద్ర ఉంది. ఇది కొన్నేళ్లపాటు వైసీపీని వెంటాడనుంది. దీంతో ఉద్యోగుల ఓటు బ్యాంకు ఆ పార్టీకి 2029లో కూడా చేరువ అయ్యే అవకాశం లేదు. అదేసమయంలో కమ్మ సామాజిక వర్గంలో వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని నుంచి పార్టీ బయటకు రాలేదు. ప్రజా నేతగా కంటే కూడా.. ఒక నియంత్రిత ధోరణి ఉన్న నాయకుడిగా జగన్ ముద్ర వేసుకున్నారు. ఇన్ని మైనస్‌లూ.. వైసీపీని వెంటాడుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ.. వైసీపీతోనే పోరాటం చేయాల్సి ఉంటుందని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.