ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీనాయకులు ఉన్నాయని.. వారిని వెనుకేసుకువస్తున్న వారిలో సీఐ, ఎస్ ఐ సహా.. చంద్రబాబు కూడా దోషేనని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్.. పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. ఇక్కడి నుంచి కొన్ని కుటుంబాల వారు పొరుగు ప్రాంతాల కు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు.
తిరిగి వారు తమ సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని తెలిపా రు. దీనికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే కారణమని.. అణిచివేతేనని వ్యాఖ్యానించారు. సాల్మన్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారని.. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని వ్యాఖ్యానించా రు. ఎల్లకాలం బాబు మాత్రమే అధికారంలో ఉండరని.. పరిస్థితులు మారుతాయని జగన్ చెప్పారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తల చేతుల్లో కిరాతకంగా హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.
వైసీపీ హయాంలో ..
అయితే.. ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్.. తన పాలన విషయంలోనూ ఒకసారి పిన్నెల్లిలో ఏం జరిగిం దన్నది రికార్డులు చూసుకుంటే తెలుస్తుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. పిన్నెల్లి గ్రామంలో 250 టీడీపీ కుటుంబాలను పొరుగు ప్రాంతాలకు తరిమి కొట్టారు. అప్పట్లో కనిపిస్తే తరిమిస్తే.. అనే నినాదాన్ని వైసీపీ నాయకులు అనుసరించారు.
ఫలితంగా టీడీపీ కార్యకర్తలు కుటుంబాలను తీసుకుని సొంత ఇళ్లు, పొలాలను కూడా వదిలేసి పారిపో యారు. చివరకు టీడీపీ నేతలు.. హైకోర్టును ఆశ్రయించి.. ఉపశమనం కలిగించాయి. కానీ, నాటి పరిస్థితిని జగన్ మరిచిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. కానీ, ఇప్పటికీ పిన్నెల్లికి జగన్ వెళ్లినా.. ఇక్కడివారు అప్పట్లో ఏం జరిగిందో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.