వైసీపీ అధినేత జగన్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది తర్వాత.. ఆయన పాద యాత్ర ఉండనుందని స్వయంగా ప్రకటించారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆయ న పాదయాత్ర చేస్తానన్నారు. ఇక, పాదయాత్రల కుటుంబంగా పేరొందిన వైఎస్ ఫ్యామిలీలో ఇది కొత్తకాదు. అంతేకాదు.. జగన్‌కు అయితే మరీ కొత్తకాదు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేసి విజయం దక్కించుకున్నారు.
వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర చేశారు. 2003లో సాగిన పాదయాత్ర ద్వారా ఆయన 20 04లో అధికారంలోకి వచ్చారు. అయితే.. మరోసారిపాదయాత్ర చేయనని.. ఆ అవసరం రాకుండా పాలిస్తాన ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. ఒక్కసారి అధికారంలోకి వస్తే.. మళ్లీమళ్లీ దానిని నిలబెట్టుకునే లా పాలన ఉంటుందని పరోక్షంగా అప్పట్లో రాజశేఖరరెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఆయన వారసుడిగా రాజకీ య అరంగేట్రం చేసి..పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన జగన్.. మళ్లీ యాత్రకు రెడీ కావడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
ఎందుకంటే.. పాదయాత్రతో ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తన పాలనతో ప్రజలను మెప్పిం చగలగడం అనేది నాయకుల ప్రధాన లక్షణం. ఈ విషయంలో జగన్ సక్సెస్ అయి ఉంటే.. ఇప్పుడు మరోసారి పాదయాత్రకు రెడీ కావాల్సిన అవసరం ఉండదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు.. మరోసారి పాదయాత్ర చేస్తున్నారంటే..అది గత పాలనను జగన్ తప్పు అని ఒప్పుకొన్నట్టేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, ఇప్పుడు కొత్తగా పాదయాత్ర చేసి జగన్ తెలుసుకునే విషయాలు ఏముంటాయి? అనేది కూడా ప్రశ్న. గతంలో ఉన్న సంక్షేమం ఇప్పుడు కొనసాగుతోంది.. గతంలో ఉన్న సమస్యలను కూడా ప్రస్తుత ప్రభు త్వం పరిష్కరిస్తోంది. అలాంటప్పుడు.. ఇప్పుడు పాదయాత్ర చేయడం ద్వారా ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏంటి? అనేది కీలకం. పైగా తన పాలనలో తప్పులను ఇప్పుడు సరిచేసుకునే ప్రయత్నం చేస్తారా? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. మళ్లీ పాదయాత్రంటే.. జనాల్లో పెద్దగా ఇంట్రస్ట్ అయితే కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.