మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ లకు పద్మశ్రీ

admin
Published by Admin — January 25, 2026 in Movies
News Image

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 131 మందికి పద్మ అవార్డుల దక్కగా..అందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 11 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ తోపాటు, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ను పద్మశ్రీ వరించింది. కళల విభాగంలో ఈ ఇద్దరు దిగ్గజ నటులను పద్మశ్రీ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది.

వీరితోపాటు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రకు(మరణానంతరం) పద్మ విభూషణ్, మలయాళ లెజెండరీ నటుడు మమ్మూట్టికి పద్మ భూషణ్ దక్కాయి. ఇరు, తెలుగు రాష్ట్రాలకు నుంచి మొత్తం 11 మంది పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, వెంపటి కుటుంబ శాస్త్రి, విజయ్‌ ఆనంద్‌రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికారెడ్డి, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, గూడూరు వెంకట్రావు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ లకు పద్మశ్రీ దక్కింది.

Tags
tollywood actor rajendraprasad tollywood actor murali mohan padmasri awards padma bhushan padma vibhushan malayalam actor mammootty
Recent Comments
Leave a Comment

Related News