బాబు మీట్స్ గేట్స్…హిస్టరీ రిపీట్స్!

admin
Published by Admin — January 23, 2025 in Politics
News Image

1998లో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్ర బాబు….మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తో 15 నిమిషాల అపాయింట్ మెంట్ తీసుకున్నారు. చంద్రబాబు విజన్ గురించి తెలియని బిల్ గేట్స్…అతి కష్టం మీద ఆ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే, చంద్రబాబు విజన్ ఆయన మాటల్లో కనిపిస్తుండడంతో బిల్ గేట్స్ …చంద్రబాబుతో దాదాపు గంటన్నర మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖచిత్రాన్ని మార్చేసింది.

ఉమ్మడి ఏపీకి ఐటీ రంగాన్ని చంద్రబాబు పరిచయం చేయడంతో నేడు లక్షలాది మంది తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఐటీ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. కట్ చేస్తే…తాజాగా దావోస్ లో మరోసారి బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. 1998లో ఐటీ గురించి మాట్లాడిన చంద్రబాబు…ఈ సారి ఏఐ గురించి బిల్ గేట్స్ తో చర్చించారు. విజన్ 2020 అంటూ ఐటీ రంగం నేడు సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన చంద్రబాబు…తాజాగా విజన్ 2047 అంటూ రాబోయే 20 ఏళ్లలో ఏఐ రంగంలో రాబోతోన్న విప్లవాత్మక మార్పుల గురించి బిల్ గేట్స్ తో చర్చించారు.

బిల్ గేట్స్ ను తొలిసారిగా 1995లో కలిసినప్పుడు ఐటీ గురించి చర్చించామని, ఇప్పుడు 2025లో మరోసారి గేట్స్ ను కలిసినప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంశంపై చర్చించామని చంద్రబాబు అన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలవడం సంతోషం కలిగించిందని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు, గేట్స్ భేటీలో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం కావాలని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ ఏర్పాటుకు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను మంత్రి నారా లోకేశ్ కోరారు.

ఆ ప్రతిపాదనపై బిల్ గేట్స్ స్పందించారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు. 1998లో మాదిరిగానే 2025లో బాబు మీట్స్ గేట్స్…హిస్టరీ రిపీట్స్…అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Recent Comments
Leave a Comment

Related News