దావోస్ టీమిండియా కెప్టెన్ గా చంద్రబాబు

admin
Published by Admin — January 23, 2025 in Politics
News Image

ఇప్పటివరకు దావోస్ కు వెళ్లే భారతదేశానికి చెందిన కేంద్ర మంత్రులు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆర్థిక మంత్రులు ఎవరికి వారు.. తమ తమ రాష్ట్రాలకు ప్రాజెక్టులు కుదుర్చుకోవటంలో తెగ బిజీగా ఉండేవారు. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఒకే వేదికపైకి కేంద్ర మంత్రుల టీం.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కలిపిన ఒక టీం కలిసి ఉమ్మడిగా ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా భేటీలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లతో పాటు ఇతర కేంద్ర మంత్రులు.. ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. దావోస్ నుంచి ఈసారి ఎలాంటి టెక్నాలజీని తీసుకెళుతున్నారన్న ప్రశ్నకు అదిరేలా చంద్రబాబు నుంచి ఆన్సర్ వచ్చింది. తాము ఇక్కడి నుంచి టెక్నాలజీని తీసుకెళ్లటం లేదని.. ప్రపంచానికే తమ దేశం టెక్నాలజీని అందజేస్తోందని.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ టెక్నాలజీకి బలమైన పునాది వేశారని బదులిచ్చారు. ఈ సందర్భంగా బ్లూంబర్గ్ అనలిటిక్స్ ప్రకారం 2028నాటికి జీడీపీ వ్రద్ధిలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్న చంద్రబాబు.. అక్కడి నుంచి భారత్ కు ఎదురే ఉండదన్న మాటను చెప్పారు.

దావోస్ కు హాజరవుతున్న వారిలో తానే సీనియర్ నని.. తొలిసారి 1997లో వచ్చినట్లుగా చంద్రబాబు.. ‘‘అప్పట్లో పోటీ ఒకరిద్దరు కేంద్ర మంత్రుుల.. ఒకటి.. రెండు రాష్ట్రాల ఆర్థిక మంత్రులుమాత్రమే వచ్చేవారు. తర్వాత పోటీ పెరిగి.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్రమంత్రులు హాజరవుతున్నారు. ఈసారి అద్భుతమైన ఆహ్వానం లభించింది. భారత టీంకు అత్యుత్తమ గుర్తింపు లభించింది. దావోస్ లో తొలిసారి నేను టీమిండియాను చూస్తున్నా. మేం వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారిమైనప్పటికీ ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట నినాదంతో ఉన్నాం’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ముచ్చట పడేలా ఉన్నాయని చెప్పొచ్చు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనకు అవకాశం లభించిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోడీని అదే పనిగా పొగిడే చంద్రబాబు.. ఈసారి అదే తీరును ప్రదర్శించారు. పటిష్టమైన విధానాలతో పాటు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా బ్రాండ్ బలంగా ుందని.. ఈసారి దావోస్ వేదికకు అత్యుత్తమ కేంద్ర టీంను పంపిన మోడీని మళ్లీమళ్లీ అభినందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సానుకూలతల్నిచంద్రబాబు తనదైన రీతిలో ప్రస్తావించారు. మహారాష్టర ఆర్థికంగా చాలా బలంగా ఉందని.. తలసరి ఆదాయంతో పాటు ఇతర ఎకో సిస్టమ్ లో తెలంగాణ ముందు ఉందని.. ఆంధ్రప్రదేశ్ వాటి స్థాయికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలన్న ఆయన.. ఆ దిశగా పని చేస్తున్నట్లుగా చెప్పిన వైనం ఆకట్టుకునేలా మారింది.

 
Recent Comments
Leave a Comment

Related News