అమెరికా అధ్యక్షుడు ట్రంప్(trump)కు ఇరాన్(Iran) యుద్ధం(war) సెగ భారీగా తగులుతోంది. ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యా ప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కారు. `ట్రంప్ దిగిపో` అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ఆందోళన(protest) చేశారు. మొత్తం 50 రాష్ట్రాల్లోని 4 వేల నగరాల్లో సుమారు 90 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలు ఎవరి ప్రోద్బలం లేకుండానే నిరసనలకు హాజరు కావడం సంచలనంగా మారింది. `నో.. కింగ్` అని రాసి ఉన్న ప్లకార్డులు విస్తృతంగా కనిపించాయి.
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో దేశ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. మరోవైపు సుంకాల కారణంగా ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటడంతోపాటు నిరుద్యోగ సమస్య అమెరికన్లను వెంటాడుతోంది. దీనికితోడు ఏఐ ప్రభావంతో పోతున్న ఉద్యోగాలు కూడా.. నిరుద్యోగాన్ని మరింత శాసిస్తున్నాయి. ఈ పరిణామాలపై తరచుగా అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
“లాభాల కోసం యుద్ధమా?” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “అమెరికా సైనికులు అమ్మకానికి లేరు” అంటూ యుద్ధ విధానాలపై వ్యతిరేక నినాదాలు వినిపించారు. “అన్యాయం చట్టమైతే, ప్రతిఘటనే కర్తవ్యం” అంటూ గట్టిగా నినదించారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశా యి. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ, రక్షణ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే దిగి వచ్చినా..
వాస్తవానికి ప్రజల నాడిని తెలుసుకున్న ట్రంప్ ఇప్పటికే చాలా విషయాల్లో దిగి వచ్చారు. అయితే.. నిలక డలేని హమీలు.. వాక్చాతుర్యం ఉందని భావిస్తూ.. చేసే వ్యాఖ్యలు అమెరికన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవు తోంది. దీంతో ఇప్పుడు ఏకంగా ట్రంప్ దిగిపో నినాదాలు మిన్నంటాయి. మరోవైపు.. దేశంలో మధ్యంతర ఎన్నికలు కూడా ఉండడంతో అధికార రిపబ్లికన్లు సైతం ట్రంప్‌పై గుర్రుగా ఉన్నారు.