జగన్ కు జగనే శత్రువు.. ఇదే ప్రూఫ్

admin
Published by Admin — April 04, 2026 in Politics
News Image

``పాపం జ‌గ‌న్‌.. ఇట్టే దొరికిపోతున్నారు!``.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు పార్టీల‌కు అతీతంగా.. సాధార‌ణం నుంచి అసాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు కూడా ఇదే మాట అంటున్నారు. ``జ‌గ‌న్‌.. చేసే త‌ప్పుల కోసం.. వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌నే ఒక త‌ప్పుడు మ‌నిషి. ఆయ‌న చేసేవ‌న్నీ త‌ప్పులే`` అంటూ.. కొన్నాళ్ల కింద‌ట‌.. సొంత సోద‌రి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

అయితే.. ఆమె ఏముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జ‌గ‌న్‌.. అంతే అడ్డంగా బుక్క‌య్యారు. ``ఏపీ రాజ‌ధా ని అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌న మౌనంగా ఉంటే బాగుండేది. లేనిపోని విష‌యాల‌ను తెర‌మీదికి తెచ్చి.. త‌న‌ను తాను ప‌లుచ‌న చేసుకుంటున్నారు. మ‌మ్మ‌ల్ని కూడా ప‌లుచ‌న చేస్తున్నారు`` అంటూ.. ఓ మాజీ మంత్రి(ఉత్త‌రాంధ్ర‌) వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి వైసీపీలోని మేధావుల మాట కూడా ఇదే.

`మావిగ‌న్‌` అంటూ.. రెండు రోజుల కింద‌ట జ‌గ‌న్ చేసిన రాజ‌ధాని వ్యాఖ్య‌.. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ స‌బ్జెక్టుగానే ఉంది. తాజాగా టీడీపీకి చెందిన నాయ‌కులు, మాజీ మంత్రులు , ప్ర‌స్తుత మంత్రు లు కూడా ఈ విష‌యాన్నిప‌దే ప‌దే చెబుతున్నారు. ఎద్దేవా కూడా చేస్తున్నారు. ``జ‌గ‌న్‌కు ఏదో అయింది. ఆయ‌న ఇక పార్టీని న‌డిపిస్తార‌ని నేను అనుకోవ‌డం లేదు. ఇక‌, పార్టీలోనూ ఎవ‌రూ ఉండ‌రు. `` అని మంత్రి నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

``ఒక‌ప్పుడు.. జ‌గ‌న్ అంటే అంతో ఇంతో గౌర‌వం ఉండేది. పార్టీలు వేరైనా.. ఆయ‌న ప‌ట్ల సానుభూతి ఉండేది. కానీ.. ఇప్పుడు ఆయ‌న ఏం మాట్లాడుతున్నారో.. ఏమో.. మావిగన్ అనేది నేనేకాదు.. ప్ర‌జ‌లు కూడా ఎప్పుడూ విన‌లేదు. ఆయ‌న‌కు మ‌తి భ్ర‌మించిన‌ట్టు అనిపిస్తోంది. ఆయ‌న స‌త్వ‌ర‌మే విశాఖ‌కు వ‌స్తే.. ప్ర‌త్యేక వైద్యుల‌ను సంప్ర‌దించేలా నేనే స్వ‌యంగా ఏర్పాట్లు చేయిస్తా`` అని మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. ఆన్‌లైన్ వేదిక‌గా. కూడా జ‌గ‌న్ దొరికేస్తున్నారు. దొరికేశారు కూడా. ఇక‌, చంద్ర‌బాబు కూడా.. మావిగ‌న్ వ్యాఖ్య‌ను త‌ప్పుబ‌ట్టారు. బుద్ధి ఉన్న‌వారు ఎవ‌రూ ఇలా మాట్లాడ‌ర‌ని.. అన్నారు. ఇలాంటి నాయ‌కుడికి ప‌గ్గాలు ఇస్తే మ‌ళ్లీ రాష్ట్రం స‌ర్వం నాశ‌నం చేస్తార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

Tags
Jagan cm chandrababu enemy trolling baseless comments
Recent Comments
Leave a Comment

Related News