అమ‌రావ‌తి రైతుల‌కు గుడ్ న్యూస్

admin
Published by Admin — July 12, 2026 in Andhra
News Image

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజ‌ధానికి రెండో విడ‌త‌లో భూములు ఇచ్చేం దుకు ముందుకు వ‌చ్చిన వారికి సంపూర్ణ రుణ‌మాఫీ చేయ‌నున్న‌ట్టు తెలిపింది. ఇప్ప‌టికే గ‌తంలో భూములు ఇచ్చిన రైతు ల‌కు రుణ మాఫీ చేసిన విష‌యాన్ని గుర్తు చేసిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు రెండో విడ‌తలో భూములు ఇచ్చి రాజ‌ధానికి స‌హ‌క రిస్తున్న రైతుల‌కు రుణ‌మాఫీ చేసి ఆదుకుంటామ‌ని పేర్కొంది. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది.

దాదాపు 30కి పైగా అంశాల‌పై మంత్రివ‌ర్గంలో చ‌ర్చించారు. ప్ర‌ధానంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కు ముందుకు వ‌చ్చే సంస్థ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు ఇచ్చే విష‌యంపై చ‌ర్చించారు. అలాగే.. అమ‌రావ‌తి రాజ‌ధానిని 2028నాటికి తొలి ద‌శ ప‌నులు పూర్తి చేయ‌డంపైనా మంత్రుల‌తో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నుల‌పై ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. రాజ‌ధాని ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. వ‌ర్షాలు వ‌చ్చినా.. ప‌నులు ఆగ‌కుండా చేప‌ట్టాల‌ని ఇప్ప‌టికే కాంట్రాక్టు సంస్థ‌ల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్టు వివ‌రించారు.

ఇదేస‌మ‌యంలో సోష‌ల్ మీడియా వ్య‌వహారంపైనా సుదీర్ఘంగా చ‌ర్చించారు. కేబినెట్ స‌మావేశంలో డీజీపీని పిలిచి.. ఆయ‌న ద్వారా సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ్యాఖ్య‌లు.. దీనికి సంబంధించి ఇత‌ర దేశాల్లో ఉన్న చ‌ట్టాల‌పైనా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెం టేష‌న్ ఇప్పించారు. భావ ప్ర‌క‌ట‌న పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడేవారిని ఉపేక్షించ‌రాద‌ని నిర్ణ‌యించారు. సోష‌ల్ మీడియా చ‌ట్టం మ‌రింత ప‌దునుగా ఉండేలా తీర్చిదిద్దాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు సూచించారు. అలాగే.. గ్రామాల్లో స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించేందుకు దాదాపు 9500 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించేందుకు మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

జిల్లాల వారీగా ప‌లు ప్రాజెక్టుల‌కు కూడా కేబినెట్ ఆమోదంతెలిపింది. వీటిలో కడపలో ఇంటిగ్రేటెడ్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కు,   విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేడ్కర్‌ గురుకుల సీవోఈ ఏర్పాటుకు మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. బీసీ విద్యార్థుల కోసం.. ఐఐటీ జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లకు కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. పూర్తి రెసిడెన్షియ‌ల్ విధానంలో వీటిని అమ‌లు చేయ‌నున్నారు. రాజ‌ధాని ప్రాంతంలో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన సంస్థ‌ల‌కు భూములు కేటాయింపుపైనా మంత్రి వ‌ర్గం చ‌ర్చించి ఆమోదం తెలిపింది.

Tags
amaravati farmers good news cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News