‘లెనిన్’ బాక్సాఫీస్ ఊచకోత.. 2 రోజుల‌ కలెక్షన్స్ ఇవే!

admin
Published by Admin — July 12, 2026 in Movies
News Image

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni) ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద తన అసలైన మాస్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. ఆయన నటించిన తాజా రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ థియేటర్లలో రచ్చ లేపుతోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో అఖిల్ ఊరమాస్ లుక్, పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన వసూళ్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘లెనిన్(Lenin)’ చిత్రం కేవలం 48 గంటల్లోనే రూ. 37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక క్రేజీ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. చాలా కాలంగా ఒక సాలిడ్ కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్న అఖిల్‌కు, ఈ సినిమా రూపంలో పర్ఫెక్ట్ సక్సెస్ దక్కినట్లయింది. దీంతో అక్కినేని అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు.

కాగా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన విధానం, యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) తన గ్లామర్‌తో, నటనతో ఆకట్టుకోగా.. ఎస్‌ఎస్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని ప్రేక్షకులు చెప్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వీకెండ్ ముగిసే సమయానికి మరిన్ని భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags
Lenin Lenin Movie Lenin Collections Lenin Review Akhil Akkineni Bhagyashri Borse Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News