ఆ స్టార్‌తోనే డేట్‌కి వెళ్తా.. భాగ్యశ్రీ బోల్డ్ కామెంట్స్‌..!

admin
Published by Admin — July 27, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయిన యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల విడుదలైన ‘లెనిన్(Lenin)’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు, వరుస ఆఫర్లతో ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ అడిగిన ఒక సరదా ప్రశ్నకు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినీ పరిశ్రమలో ఏ సెలబ్రిటీతో డిన్నర్ డేట్‌కి వెళ్లాలని కోరుకుంటారు? అని ప్రశ్నించగా... ఏమాత్రం ఆలోచించకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పేరును చెప్పి షాకిచ్చింది భాగ్య‌శ్రీ‌.

అనుష్క(Anushka)తో డిన్నర్ డేట్‌పై స్పందిస్తూ... ఆమె తనకు కేవలం నటిగా మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎంతో ఇష్టమని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు నుంచి అనుష్క ప్రయాణాన్ని ఎంతో ఆరాధనగా గమనిస్తున్నానని, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. ఒకవేళ తనకు అవకాశం వస్తే అనుష్కతో కలిసి కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలని, ఆమె జీవిత అనుభవాలను తెలుసుకోవాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. మొత్తానికి, తొలి విజయంతోనే కెరీర్‌ను దూసుకుపోతున్న భాగ్యశ్రీ బోర్సే... ఏకంగా టాలీవుడ్ స్వీటీ అనుష్కపై తన ఉన్న అభిమానాన్ని ఇలా ఓపెన్‌గా బయటపెట్టడంతో ఈ బోల్డ్ అండ్ క్యూట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Tags
Bhagyashri Borse Anushka Shetty Lenin Movie Tollywood South Cinema Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News