డీప్ టెక్ హబ్ గా అమరావతి

admin
Published by Admin — May 18, 2026 in Politics
News Image
కేవ‌లం ఏఐ స‌హా.. టెక్నాలజీకి మాత్ర‌మే కాకుండా.. డీప్ -టెక్‌కు కూడా అమ‌రావ‌తి రాజ‌ధానిలో పెద్ద పీట వేస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. భ‌విష్య‌త్తు సాంకేతిక రంగానికి అమ‌రావ‌తి ప్రాధాన్యం ఇస్తుంద ని చెప్పారు. త‌ద్వారా.. అమ‌రావ‌తి రాజ‌ధాని.. ప్ర‌పంచ టెలీ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌కు కీల‌కం కానుంద‌ని వెల్ల‌డించారు. దీనికి ప్ర‌ధానంగా.. క్వాంటం కంప్యూటింగ్ వ్య‌వ‌స్థ కీల‌క రోల్ పోషించ‌నుంద‌ని పేర్కొన్నారు.
 
ఉద్యోగ ఉపాధి రంగాల‌కేకాకుండా... సాంకేతికంగా కూడా.. అమ‌రావ‌తి డీప్ టెక్ సాంకేతిక‌త‌తో ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని తెలిపారు. ‘క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్’ ఏర్పాటు చేసిన త‌ర్వా త‌.. అమ‌రావ‌తిపై ప్ర‌పంచ దేశాల దృక్ఫ‌థంలో మ‌రింత మార్పు చోటు చేసుకుంద‌ని వివ‌రించారు. క్వాంటం వ్యాలీ ఆవిష్క‌ర‌ణలు, ప‌రిశోధ‌న‌ల‌కు క్వాంటం వ్యాలీ ప‌రిజ్ఞానం ఎంత‌గానో దోహ‌ద ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. టెలీకమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన సీడాట్ కూడా అమ‌రావ‌తిలో విభాగం ఏర్పాటు చేయ‌నుంద‌ని వివ‌రించారు.
 
క్వాంటం-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌ ఏర్పాటుతో అమ‌రావ‌తి రాజ‌ధాని.. ప‌రిశోధ‌న‌ల‌కు కేంద్రంగా మారుతుంద‌ని వివ‌రించారు. దీనిలో ప్ర‌పంచ స్థాయి శాస్త్ర‌వేత్త‌లు, విద్యార్థులు కూడా భాగ‌స్వాములు కాను న్నార‌ని తెలిపారు. డీప్ టెక్ టెక్నాల‌జీ కేంద్రంగా మారే అమ‌రావ‌తి పేరు ప్ర‌పంచ స్థాయిలో మార్మోగ‌నుం ద‌ని పేర్కొన్నారు. ఉద్యోగ‌, ఉపాధి కేంద్రాలు ఏర్ప‌డనున్నాయ‌ని తెలిపారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సాంకేతికంగా అమ‌రావ‌తి పురోభివృద్ధిలో ముందుకు సాగుతుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags
amaravati deep tech hub cm chandrababu tdp
Recent Comments
Leave a Comment

Related News

Latest News