వైసీపీలోకి ష‌ర్మిల రీఎంట్రీ.. ఏంటి నిజ‌మే..?

admin
Published by Admin — September 21, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు అంతకంటే ఉండరు అంటారు. సరిగ్గా ఇదే సూత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం వరకు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల(YS Sharmila) ఇప్పుడు మళ్లీ ఒక్కటవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అన్న జగన్‌(Jagan)ను దెబ్బతీయడంలో షర్మిల కీలక పాత్ర పోషించారనే వాదన ఉంది. అయితే, ఆ ఎన్నికల ఫలితాలు ఇద్దరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చాయి. ఒకరికొకరు పోరాడుతూ చివరికి ఉమ్మడి ప్రత్యర్థికే రాజకీయంగా లాభం చేకూర్చారనే వాస్తవం ఈ కుటుంబానికి ఆలస్యంగా బోధపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా షర్మిల ఆశించిన స్థాయి ఫలితాలను సాధించలేకపోవడం, మరోవైపు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఇద్దరూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేందుకు, భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా వైఎస్ విజయమ్మ(Vijayamma) రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. తల్లి చొరవతో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలను తొలగించి, షర్మిలను తిరిగి వైసీపీలోకి ఆహ్వానించే దిశగా తెరవెనుక తీవ్ర కసరత్తు జరుగుతోందని టాక్ నడుస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో జగన్‌కు ఇబ్బందులు ఎదురైనా, పార్టీని ముందుండి నడిపించే నాయకత్వ లోపం రాకుండా షర్మిల సేవలను మళ్లీ వినియోగించుకోవాలనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబ సమేతంగా రాజకీయాలను నడిపిస్తూ ప్రజల్లో సానుకూలత సంపాదిస్తున్న తీరును వైసీపీ వ్యూహకర్తలు బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటేనే ప్రజల్లో బలమైన సంకేతాలు వెళ్తాయనే అరాన్ని గుర్తించి, జగన్ కూడా ఈ రాజీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు, రాజకీయ పదవుల హామీలపై ప్రస్తుతం మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నాయని, ఇవి కొలిక్కి వస్తే త్వరలోనే షర్మిల మళ్లీ ఫ్యాన్ గూటికి చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది కాలమే సమాధానం చెప్పాలి.

Tags
YSRCP YS Jagan YS Sharmila Andhra Pradesh AP Politics Vijayamma YSR Family AP News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News