మేడ‌లొదిలి జ‌నంలోకి.. అదితి గ‌జ‌ప‌తి రెండేళ్ల రికార్డులు ..!

admin
Published by Admin — September 23, 2026 in Politics, Andhra
News Image

విజయనగరం(Vizianagaram) నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యురాలు, కూటమి తరఫున విజయం సాధించిన పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు సాధార‌ణ నాయ‌కురాలిగా మారిపోయార‌న్న టాక్ వినిపిస్తోంది.  నియోజకవర్గంలో ఆమె పనితీరు, ప్రజాభిప్రాయానికి సంబంధించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ప్రజల‌తో క‌లివిడిగా ఉండ‌డ‌మే కాకుండా..  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  నియోజకవర్గంలో మౌలిక వసతులు, తాగునీరు, రోడ్ల మరమ్మతులు వంటి స్థానిక సమస్యలపై దృష్టి సారించారు.

అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేయించేలా చూస్తున్నారు.   ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి, పాలనపై మంచి స్పందన ఉంది. ప్రజలు ఎదుర్కొనే చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక యంత్రాంతాన్ని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆమె తండ్రి పూసపాటి అశోక్ గజపతి రాజు(Pusapati Ashok Gajapathi Raju) సౌమ్యుడిగా, మృదుస్వభావిగా ఎలా అయితే పేరు తెచ్చుకున్నారో.. ఇప్పుడు ఆమె కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే..  తన తండ్రికి భిన్నంగా చాలా చురుకైన, సాహసోపేతమైన రాజకీయాలు చేస్తున్నార‌ని అంటున్నారు.

ఇదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ప్రత్యర్థులకు గట్టి సవాలు విసురుతున్నారు.  'మాస్ పాలిటిక్స్(Mass Politics)` ద్వారా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.  సంక్షేమ పథకాలను నియోజకవర్గ స్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.  మత్స్యకార భరోసా వంటి పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా సహాయం అందేలా చూస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు.  ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.

సాధారణ గృహిణిగా ఉంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అదితి విజయలక్ష్మి గజపతి రాజు, అతి తక్కువ కాలంలోనే సమర్థవంతమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెరిగే చేస్తున్నారు. ఎక్క‌డా విభేదాలు రాకుండా.. వివాదాల జోలికి పోకుండా కూడా అదితి(Aditi Gajapathi Raju) జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న తండ్రి తాలూకు లెగ‌సీని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు.. గ‌తానికి భిన్నంగా ఉండ‌డంతో అదితి ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యేనే అయిన‌ప్ప‌టికీ.. గ‌ట్టి పునాదుల‌ను బ‌లోపేతం చేసుకుంటున్నారు.

Tags
Aditi Gajapathi Raju Vizianagaram MLA Pusapati Ashok Gajapathi Raju Vizianagaram politics AP News AP Politics TDP
Recent Comments
Leave a Comment

Related News