ఢిల్లీలో ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, సర్ ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1928లో సైమన్ గో బ్యాక్ ఉద్యమం తరహాలోనే 2028లో ‘సర్’ గో బ్యాక్ ఉద్యమం రాబోతోందని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, మోదీ కలిసి 20 కోట్ల ఓట్లు తొలలగించేందుకు ప్లాన్ చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
ఎలక్షన్ కమిషన్ లో మరో ఇద్దరున్నారని, కానీ, వారికి కూడా జ్ఞానేశ్ కు ఏం చేస్తున్నారో తెలియదని, అంత జ్ఞానం ఆయనకు ఎక్కడిదో తెలియడం లేదని చురకలంటించారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరకు జ్ఞానేశ్ ను పంపించాలని, ఆ దేశంలో తరహాలోనే మోదీ గుర్తు, ఛానెల్ ఏర్పాటు చేస్తే అందరూ మోదీకే ఓటేస్తారని సెటైర్లు వేశారు. మమతా బెనర్జీ, .ఉద్ధవ్ థాకరే, స్టాలిన్ మాదిరిగా సర్ ను వ్యతిరేకించే వారు కలిసి ఓట్ల తొలగింపు, ఎస్ఐఆర్ సమస్యపై పోరాడాలని పిలుపునిచ్చారు.