ఖైరతాబాద్ బై-పోల్‌: బ‌రిలోకి పవన్ ఆప్తమిత్రుడు.!

admin
Published by Admin — September 29, 2026 in Politics, Telangana
News Image

గ్రేటర్ హైదరాబాద్ రాజకీయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే ఖైరతాబాద్ ఉపఎన్నిక(Khairatabad Bypoll). సిట్టింగ్ స్థానాల సమీకరణాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాల మధ్య ఈ బై-పోల్ అత్యంత రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య సాధారణంగా జరిగే త్రిముఖ పోరులా ఇది కనిపించడం లేదు. ఎందుకంటే ఈసారి రంగంలోకి జనసేన సైతం దూసుకురావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులవుతున్నాయి.

ఇప్పటివరకు ఉన్న రాజకీయ బలాబలాలను పక్కనబెట్టి, ఈసారి ఖైరతాబాద్‌లో ఒంటరిగా బరిలోకి దిగాలని జనసేన(Janasena) పార్టీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా, కేవలం తమ సొంత బలంతోనే గ్లాస్ గుర్తును ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి వేస్తున్న రౌండ్-ది-క్లాక్ వ్యూహాలు కేడర్‌లో కొత్త జోష్ నింపుతున్నాయి. రాబోయే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు ఖైరతాబాద్‌ను ఒక సెమీఫైనల్‌గా భావించి.. ఇక్కడ సత్తా చాటి పార్టీ పవర్‌ను నిరూపించాలని జ‌న‌సేన‌ స్కెచ్ వేస్తున్న‌ట్లు ఇన్‌సైడ్‌.

గ్లామర్ అస్త్రంతో మాస్టర్ స్ట్రోక్
ఈ ఉపఎన్నికను కేవలం సాధారణ రాజకీయంలా కాకుండా, ఓటర్లను కట్టిపడేసేలా ఒక బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు అత్యంత ఆప్తుడైన ఒక ప్రముఖ సీనియర్ సినీ నటుడిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతోందట. ప్రజల్లో మంచి ఫాలోయింగ్, యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ టాలీవుడ్ స్టార్ ఎంట్రీ ఇస్తే ఖైరతాబాద్ పాలిటిక్స్ ఒక్కసారిగా సరికొత్త మలుపు తిరుగుతాయనడంలో సందేహం లేదు.

ఇన్నాళ్లూ సంప్రదాయ రాజకీయ నాయకులు, కుటుంబాల మధ్యే నడిచిన ఖైరతాబాద్(Khairatabad) పోరు.. ఇప్పుడు పూర్తిగా గ్లామరస్ సమరంగా మారే సూచనలూ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్, రామ్ తాళ్లూరి గ్రౌండ్ వర్క్, తోడుగా టాలీవుడ్ సెలబ్రిటీ గ్లామర్ కలిస్తే ప్రత్యర్థులకు నిద్రపట్టడం ఖాయం. మరి ఈ హై-వోల్టేజ్ బై-పోల్‌లో జనసేన వేస్తున్న ఈ అడుగు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags
Khairatabad Bypoll Khairatabad Janasena Pawan Kalyan Telangana News Telangana Politics Hyderabad
Recent Comments
Leave a Comment

Related News