మహిళా ఎమ్మెల్యేలకు అవమానంపై కోర్టు సీరియస్

admin
Published by Admin — September 30, 2026 in Telangana
News Image

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ ఎస్ నేతలు ఆరోపించిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని కొందరు పోలీసులు అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఇక, పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత చీర లాగారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను గుర్తించాలని తెలంగాణ డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఆ అధికారుల వివరాలను సేకరించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సమర్పించాలని డీజీపీ సీవీ ఆనంద్ కు సూచనలు జారీ చేసింది

ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అసెంబ్లీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆ అధికారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే, సభలోకి ఎమ్మెల్యేలు వెళ్లకుండా నిలువరించి హక్కు పోలీసులకు లేదని, వారిపై చర్యలు తీసుకునే హక్కు స్పీకర్ కు మాత్రమే ఉందని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక,ఈ వ్యవహారంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతోపాటు పలువురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. కానీ, తాము ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు తీసుకుని కేసు నమోదు చేయడం లేదని బిఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై బీఆర్ఎస్ ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్, తెలంగాణ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Tags
High court angry on insult to brs women mlas
Recent Comments
Leave a Comment

Related News