రెండున్న‌రేళ్ల‌యినా.. కొత్త కొత్త‌గా కూట‌మి.. !

admin
Published by Admin — October 01, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో కూట‌మి సర్కారు ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు పూర్త‌యింది. స‌హ‌జంగా రెండున్న‌రేళ్ల పాటు ఒక ప్ర‌భుత్వం సాగిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల్లో అంతో ఇంతో వ్య‌తిరేక‌త రావ‌డం స‌హ‌జం. కానీ, ప్ర‌స్తుతం కూట‌మి ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌క పోగా.. మ‌రింత‌గా కొత్త‌కొత్త‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతోంది. ముఖ్యంగా వ్య‌క్తుల ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌క పోవ‌డం మ‌రింత గ‌మ‌నించాల్సిన విష‌యం. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల ఇమేజ్‌.. ప్ర‌జ‌ల్లో ఉన్న సానుకూల వాతావ‌ర‌ణం ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

తాజాగా నెల్లూరు ప‌ర్య‌ట‌న‌లో ఈ విషయం మ‌రోసారి రుజువైంది. కూట‌మికి మూల స్తంభాలుగా ఉన్న ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల్లో ఉన్న ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. నెల్లూరు(Nellore) ప‌ర్య‌ట‌న‌లో వారిని చూసేందుకు.. వారి తో సెల్పీలు దిగేందుకు ప్ర‌జ‌లు క్యూ క‌ట్టారు. అంతేకాదు.. ఇద్ద‌రు నాయ‌కులు ర్యాంపు వాక్ చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు జోరుగా నినాదాలు చేస్తూ.. హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేవారు. ఇది కూట‌మి బ‌లాన్ని స్ప‌ష్టం చేసింది. నాయ‌కులు  బ‌లంగా ఉన్న పార్టీలు పుంజుకుంటున్నాయ‌నే అంచ‌నాలు ఉన్న విష‌యం తెలిసిందే.

ఇక‌, వీరే కాదు..టీడీపీ ఐకాన్ నాయ‌కుడు, మంత్రి లోకేష్(Nara Lokesh) కు కూడా ప్ర‌జాద‌ర‌ణ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మే కాదు.. రాష్ట్ర‌స్థాయిలో ఆయ‌న ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. భావి నాయ‌కుడిగా ఆయ‌న‌ను భావిస్తున్నారు. దీనికి ఆయ‌న ప‌నితీరు.. మాట తీరు.. స్పందిస్తున్న విధానంతోపాటు.. ఉద్యోగాల క‌ల్ప‌న‌, సంస్క‌ర‌ణ‌లు వంటివి ప్ర‌ధానంగా మేలు చేస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కూట‌మి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఈ ముగ్గురు నాయ‌కులు బ‌లంగా ఉండ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నారు.

గ‌త ఎన్నికల స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు-ప‌వ‌న్(Pawan) జోడీకి ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు. ఇది కూట‌మిని అధికారంలోకి తీసుకువ‌చ్చింది. 94 శాతం రిజ‌ల్ట్ ఇచ్చింది. అలాగే.. నారా లోకేష్ చేసిన పాద‌యాత్ర కూడా క‌లిసి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు రెండున్న‌రేళ్ల  పాల‌న‌త‌ర్వాత కూడా.. ఈ ముగ్గురునాయ‌కుల ఇమేజ్ అలానే కొన‌సాగుతుండ‌డం.. ప్ర‌జ‌ల్లో మ‌రింత జోష్ పెరుగుతుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కూట‌మికి విజ‌యం త‌ధ్య‌మ‌న్న భావ‌న క‌నిపిస్తోంది. చిన్న పాటి పొర‌పొచ్చాలు ఏ పార్టీలోనైనా ఉంటాయి. కానీ, పైస్థాయిలోక‌లివిడి, చంద్ర‌బాబు-ప‌వ‌న్ కెమిస్ట్రీ, యువ‌నేత‌గా లోకేష్ ఇమేజ్ వంటివి కూట‌మిని కొత్త‌గానే మ‌రింత తాజాగా నేఉంచ‌డం గ‌మ‌నార్హం.

Tags
AP Politics Andhra Pradesh Chandrababu Naidu Pawan Kalyan Nara Lokesh TDP JSP Alliance AP Government
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News