ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రచారాంద్రులు భాగస్వాములు కావాలని గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ రాజా అన్నారు. "ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది ప్రచారాంద్రులు కూడా స్వగ్రామాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలి.
"ప్రవాసాంధ్రులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో టచ్‌లో ఉంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పనితీరును వివరించాలి. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా తెలియజేయాలి.
తమ ప్రచారం ద్వారా ప్రజల్లో అనగాహన పెంచి, కూటమి అభ్యర్థులకు మద్దతు లభించేలా ప్రతి ప్రచారాంద్రుడు తన వంతు కృషి చేయాలి. పల్లె నుంచి పట్టణం, నగరం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ ఫలాలు అందుతాయి. డబుల్ ఇంజిన్ తరహా పాలనతో రాష్ట్ర అభివృద్ధి రెట్టింపు వేగంతో ముందుకు సాగుతుంది." అని రాజా అన్నారు.