అమెరికాలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) & బాలీ 92.3 FM నిర్వహించిన దసరా దీపావళి ధమాకా (DDD) 2026 ఘనంగా ముగిసింది. ప్లెజెంటన్‌లోని అలమేడా కౌంటీ ఫేర్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వేడుక బే ఏరియాలో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. 25,000 కంటే ఎక్కువ మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. దీపావళి, దసరా వంటి రెండు పెద్ద పండుగలను కలిపి ఒకే మెగా ఈవెంట్ లా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, అమెరికా సమాజ స్పూర్తిల అద్భుతమైన సంగమంతో బే ఏరియా ప్రకాశించింది.
శాంతి, సమృద్ధి, ఆశీస్సులను కోరుతూ పవిత్ర మహా మంగళ హారతితో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. “దుర్గా మా” రథ యాత్ర (రథ ప్రదర్శన) కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భక్తి గీతాలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రంగుల పరేడ్ ఆకట్టుకున్నాయి. రామాయణాన్ని చిత్రీకరించే రామ్ లీలా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
కళాత్మకంగా అలంకరించి 40 అడుగుల ఎత్తైన రావణాసురిడి బొమ్మను దహనం చేసిన రావణ దహనం కార్యక్రమం నింగిలో నిప్పులు చిమ్మింది. వేలాది మంది సమక్షంలో రావణ దహనం ఘట్టం ముగిసింది. అధర్మంపై ధర్మం సాధించిన శాశ్వత విజయానికి చిహ్నంగా రావణ దహనం నిలిచింది.
ప్లెజెంటన్ లో బాణాసంచా పేలుళ్లతో ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్ని రీతిలో ఆకాశం కాంతిమయమైంది.
ఈ ఫైర్‌వర్క్స్ ప్రదర్శన ఆహూతులను మంత్రముగ్ధులను చేసేది. వేలాది కుటుంబాలు, పిల్లలు, స్నేహితుల ముఖాలలో దీపావళి పటాసులు కొత్త కాంతిని నింపాయి. గ్రాండ్ ఫైనల్ రాత్రి వేళ కాస్కేడింగ్ స్పార్కిల్స్‌తో వెలిగించి చీకటిపై కాంతి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
500 మంది కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇండోర్, అవుట్‌డోర్ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. క్లాసికల్, ఫోక్, బాలీవుడ్, ఫ్యూజన్ ప్రదర్శనలతో భారతదేశం యొక్క సమృద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించారు. AIA ఐడల్ పాటల పోటీలు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చాయి. 135 కంటే ఎక్కువ స్టాల్స్, 25 ఫుడ్ స్టాల్స్ ను ఆహూతులు సందర్శించారు. రుచికరమైన భారతీయ వంటకాలు, పండుగ మిఠాయిలు, సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళా రూపాలు, వస్తువులు దీపావళి అలంకారాలు, పలు విభాగాలు అందుబాటులో ఉన్నాయి.
రాత్రి వరకు గర్బా, దాండియాతో మహిళలు, పురుషులు నాట్యం చేశారు. వేలాది మంది పండుగ దీపాల వెలుగుల మధ్య నృత్యం చేసి దీపావళి ఐక్యత, ఆనంద స్పూర్తిని ప్రతిబింబించారు. సింధూర్ కేళా, ధునుచి నాచ్, హనుమాన్ చాలీసా చాంటింగ్, మహా ఖోజ్ ట్రెజర్ హంట్, కార్నివాల్ రైడ్స్, చెస్ పోటీ ఆకట్టుకున్నాయి.
కాలిఫోర్నియాలోని భారతీయ డయాస్పోరాకు పెరుగుతున్న సాంస్కృతిక, పౌర ప్రభావాన్ని ఈ ఈవెంట్ ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యులు హాజరయ్యారు.
1) కాన్సుల్ జనరల్ సతీష్ సివన్
2) అసెంబ్లీ మెంబర్ ఒర్టెగా ప్రతినిధి
3) సాన్ రామన్ మేయర్ మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్
4) డబ్లిన్ మేయర్ షెర్రీ హూ
5) ప్లెజెంటన్ మేయర్ జాక్ బాల్చ్
6) ఫ్రీమాంట్ మేయర్ రాజ్ సల్వాన్
7) సాన్ రామన్ కౌన్సిల్ మెంబర్ శ్రీధర్ వెరోస్
8) సాన్ రామన్ వైస్ మేయర్ మారిసోల్
9) బార్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ మెలిస్సా హెర్నాండెజ్
10) ప్లెజెంటన్ కౌన్సిల్ మెంబర్ జూలీ టెస్టా
స్పాన్సర్‌లకు AIA బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది
డేవిడ్ హాబర్ట్, సంజీవ్ గుప్తా CPA (ఫైర్‌వర్క్స్ స్పాన్సర్), డా. ప్రకాష్, రియల్టర్ లవణ్య దువ్వి, ట్రావెలోపాడ్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య & లైఫాలజీ (ఎడ్యుకేషనల్ పార్ట్‌నర్), జూమ్ ఎ పేపాల్ సర్వీస్ (డైమండ్ స్పాన్సర్), గోపి డైరీ (పవర్డ్ బై).
ఇతర స్పాన్సర్‌లు: సియెర్రా పసిఫిక్ ప్రైవేట్ వెల్త్, ఇన్‌స్టా సర్వీస్, మై పుర్సు, వాచి సిల్క్స్, విజేత సూపర్ మార్కెట్, కావ్య ఫుడ్స్, APEX కన్సల్టింగ్, షాస్తా ఫ్రెష్, అజాద్ ఫైనాన్షియల్స్, మలబార్ జ్యూయలర్స్ & GH ప్యాక్‌వెస్ట్ ఫౌండేషన్.
మీడియా భాగస్వాములు: NBC బే ఏరియా, నమస్తే ఆంధ్ర, TV9 USA, యో ఇండియా TV, తెలుగు టైమ్స్, విరిజల్లు మరియు ఇతరులు.
అతిధులు, ప్రదర్శనకారులు, విక్రేతలు, 100 కంటే ఎక్కువ మంది వాలంటీర్లకు ఏఐఏ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. వారి అంకితభావం ఈ భారీ వేడుకను సాధ్యం చేసిందని కొనియాడింది.