టైగర్ ష్రాఫ్ తాగే ఆ వాటర్ బాటిల్ ధర తెలిస్తే మైండ్‌బ్లాకే..!

admin
Published by Admin — October 25, 2026 in Movies
News Image

సెలబ్రిటీల లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. వారు వాడే బ్రాండెడ్ బట్టల దగ్గర నుంచి తినే ఆహారం, కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు ప్రతి ఒక్కటి అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇక బాలీవుడ్(Bollywood) యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తన కఠినమైన వర్కవుట్లతో ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ఆయన తాజాగా ఉపయోగించిన ఓ వాటర్ బాటిల్ నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది.

సాధారణంగా మనం రోజువారీ జీవితంలో వాడే నీళ్ల బాటిళ్లకు, సెలబ్రిటీలు ప్రిఫర్ చేసే బ్రాండ్స్‌కు చాలా తేడా ఉంటుంది. టైగర్ ష్రాఫ్(Tiger Shroff) చేతిలో కనిపించిన ఆ బాటిల్ ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ 'శాన్ పెల్లెగ్రినో' (San Pellegrino)కి చెందిన స్పార్క్లింగ్ మినరల్ వాటర్ అని ప్రచారం జరుగుతోంది. మార్కెట్లో ఈ 750 మి.లీ బాటిల్ ధర దాదాపు రూ.600 వరకు ఉంటుందట. ఈ రేటు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సామాన్యులు నెలంతా కష్టపడి సంపాదించే మొత్తంలో కొంత భాగం కేవలం ఈ ప్రీమియం నీళ్ల కోసమే ఖర్చువుతుందా అని చర్చించుకుంటున్నారు.

ఒకవేళ టైగర్ ష్రాఫ్ రోజుకు సగటున ఆరు లీటర్ల నీరు తాగుతాడని అంచనా వేస్తే.. లీటరుకు రూ.600 చొప్పున లెక్కిస్తే రోజుకు కేవలం నీళ్ల ఖర్చే రూ.3,600 అవుతుంది. ఇదే లెక్కను నెలకు పొడిగిస్తే ఏకంగా రూ.1.08 లక్షలు, ఏడాదికి  రూ.13 లక్షల పైమాటే అని సోషల్ మీడియాలో రకరకాల లెక్కలు వేస్తున్నారు. కేవలం హైడ్రేషన్ కోసం లక్షలు వెచ్చించడం ఒక్క టైగర్ ష్రాఫ్‌తోనే ఆగిపోలేదు.

భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ కూడా తన ఆరోగ్యం విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో తెలిసిందే. ఆయన గతంలో ఫ్రెంచ్ బ్రాండ్ 'ఎవియన్' (Evian) మినరల్ వాటర్ ఉపయోగిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అప్పట్లోనే లీటరు ఎవియన్ వాటర్ ధర సుమారు రూ.600గా నివేదికలు తెలిపాయి. అంతేకాదు, కోహ్లీ తాగే 'బ్లాక్ ఆల్కలైన్ వాటర్' ధరైతే లీటరుకు వేలల్లో ఉంటుందని ప్రచారం జరిగింది. ఏదేమైనా, సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్ కోసం అనుసరించే ఈ కాస్ట్లీ డైట్ మరియు లైఫ్‌స్టైల్ ట్రెండ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Tags
Tiger Shroff Water Bottle Bollywood Viral News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News