2019 సార్వత్రిక ఎన్నికలలో 151 సీట్లు సాధించిన వైసీపీకి ఈవీఎంలు ఆనాడు గుర్తుకు రాలేదు. కానీ, 2024లో కూటమి 164 సీట్లు గెలుచుకోగానే ఈవీఎంలు గుర్తుకు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు, సాక్ష్యాలు లేవు అంటూనే ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనతోపాటు పరకాల ప్రభాకర్ వంటి మేధావులు కూడా ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చారు.
కట్ చేస్తే ఏపీలో తాజాగా బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ అభ్యర్థులు బరిలో ఉన్నచోట చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంటే బ్యాలెట్ పేపర్ అయినా ఈవీఎం అయినా ఒకటే అన్న విషయం ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకోవాలి. జగన్ నియంత మనస్తత్వం, ఒంటెత్తు పోకడ, వైసీపీ నేతల బూతులు, విధ్వంసం...ఇవన్నీ చూసి విసిగిపోయిన ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టమైన తీర్చనిచ్చారు.
ఇప్పుడు ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థలలో ఎన్నికలలో కూడా అదే తీర్పు రిపీట్ అయింది..అవుతుంది కూడా. దీనిని బట్టి వైసీపీతో పాటు జగన్ ను ప్రజలు తిరస్కరించారని ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ఈవీఎంలపై నిరాధార ఆరోపణలు చేయడం వల్ల వైసీపీ నేతలు జనం దృష్టిలో ఇంకా దిగజారుతారు. ఇప్పటిదాకా ఈవీఎంలపై పడ్డ జగన్ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల రంగు సరిగా, క్వాలిటీ సరిగా లేదు, సిరా సరిగా పడలేదు అంటూ చిన్న పిల్లలు చెప్పినట్లుగా కుంటి సాకులు చెబుతారేమో చూడాలి. ఈ ఓటమితో జగన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇన్నాళ్లూ జగన్ డిమాండ్ చేస్తున్న బ్యాలెట్ బాక్స్ కూడా బద్దలైందని, వైసీపీ ఓటమి గుట్టురట్టయిందని చురకలంటిస్తున్నారు.