ఆ హీరోయిన్ మారలేదు!

admin
Published by Admin — November 09, 2026 in Movies
News Image

దక్షిణాది సినిమా పరిశ్రమలో తన అనుభవాల గురించి రాధికా ఆప్టే మ ఓసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.. కొన్ని సినిమాల్లో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పింది.

సెట్లలో ఎక్కువ మంది పురుషులే ఉండేవారని,. తనకు తెలిసినవారు ఎవరూ లేక,. భాష అర్థం కాక ఇబ్బంది పట్టానని వెల్లడించింది. ఏజెంట్, స్నేహితులు కూడా లేకుండా ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని, కొన్నిసార్లు ఒప్పందం లేక, స్క్రిప్ట్ కూడా ముందుగా ఇవ్వక పోవడంతో కొంచెం కష్టం గా అనిపించిందని చెప్పింది.. ఏం అడగాలో, ఎలా స్పందించాలో తెలియక కష్టపడ్డానని చెప్పింది.

 

''మరాఠీ సినిమాల్లో భాష తెలుసు, అవసరమైతే ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ దక్షిణాది షూటింగ్‌లలో పూర్తిగా ఒంటరిగా ఉండిపోయాను. కొన్ని సినిమాలు మంచి అనుభవం ఇచ్చాయి, కొన్ని మానసికంగా బాధపెట్టాయి. బాలీవుడ్‌లో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.'' అని వెల్లడించింది.

 

ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తన హద్దులు స్పష్టంగా చెప్పడం, అన్యాయం జరిగితే మాట్లాడటం నేర్చుకున్నానని రాధికా చెప్పింది. కీర్తి సురేశ్‌తో కలిసి నటించిన ‘అక్క’ సినిమా ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది. ఆల్రెడీ రాధిక ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా వంటి హీరోయిన్లు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే దక్షిణాదిలో అవకాశాలు వచ్చినప్పుడు వాడుకొని ఇప్పుడు బాలీవుడ్ లో స్థిరపడి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని రాధిక పై విమర్శలు వస్తున్నాయి.

Tags
Radhika apte
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News