పరివర్తన రాజనీతి పార్టీ.. పీఆర్‌పీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ నాయకు డు వి. విజయసాయిరెడ్డి తన ఫస్ట్ స్పీచ్‌లో.. టీడీపీ, వైసీపీ అధినేత కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమ ర్శలుగుప్పించారు. అదేసమయంలో తాను పార్టీని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో ఆయన చెప్పారు. అలానే.. తనకు పదవులు ఎలా వచ్చాయో.. కూడా వివరించారు. అదేసమయంలో నాయకత్వ లక్షణాలు ఉన్న యువతను ఎంకరేజ్ చేసేందుకు తాను ఈ పార్టీని ప్రారంభించినట్టు తెలిపారు.
నా కష్టార్జితంతోనే..
తనకు వచ్చిన పదవుల విషయంలో అనేక విమర్శలు వున్నాయన్న సాయిరెడ్డి.. ఇవేవీ అయాచితంగానో.. కుటుం బ సభ్యుల సిఫారసులతోనో తనకు పదవులు రాలేదన్నారు. తాను కష్టించి దక్కించుకున్నవేనన్నారు. వైసీపీ ఏర్పాటులో తాను కూడా ఎంతో కష్టపడ్డానని.. ఇటుక ఇటుక పేర్చడంలో తన పాత్ర ఉందన్నారు. కానీ, తనకు ఎంతో అవమానం జరిగిందన్నారు. తనను తీవ్ర అవమాన కర రీతిలో బయటకు పంపారన్నారు. కొలిమిలో కాలిన ఇనుములాగా అనేక దెబ్బలు తిన్నానన్నారు.
సీఎం కొడుకే..
ఈ సందర్భంగా కుటుంబ రాజకీయాలపై సాయిరెడ్డి నిశిత విమర్శలు గుప్పించారు. సీఎం కుమారుడే మళ్లీ ముఖ్య మంత్రి కావాలా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత(జగన్) కుమార్తెలే సీఎంలు కావాలా? అని నిలదీశారు. తన పార్టీలో కుటుంబాలకు తావులేదని.. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా కష్టపడి రాజకీయంగా ఎదగాలని భావించే యువతకు ప్రాధా న్యం ఉంటుందని సాయిరెడ్డి వివరించారు. యువతకు ఆహ్వానం పలికారు. రెండు కులాలే రాష్ట్రాన్ని పాలిస్తున్నా యని ఆరోపించారు. కానీ.. పీఆర్‌పీలో అలా జరగదని అన్నారు. కులాలు మతాలతో సంబంధం లేకుండా రాజకీయాలు కొనసాగుతాయన్నారు.
అహంకారమే జగన్‌ను ఓడించింది!
2019లో 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రజలు.. అదే వైసీపీని 2024లో 11 స్థానాలకు పరిమితం చేశారని సాయిరెడ్డి చెప్పారు. దీనికి కారణం.. జగన్ అహంకార పూరిత వైఖరేనని చెప్పారు. సంక్షేమాన్ని అమలు చేశారని.. ప్రజలు కూడా దానిని యాక్సెప్ట్ చేశారని.. కానీ, అహంకార పూరిత వైఖరి కారణంగానే పార్టీ నేల మట్టం అయిందని చెప్పారు. కాగా.. తాను రాష్ట్ర భవిష్యత్తు మొత్తాన్నీ తాను మార్చేస్తానని చెప్పడం లేదన్నారు. కానీ, మార్పు(పరివర్తన) కోసం పార్టీ పెట్టామని.. పదవులు వారసత్వంగా ఉండకూడదన్నదే తన పార్టీ లక్ష్యమని అన్నారు.