టాలీవుడ్ లో ఉన్న స్టార్ యాంకర్స్ లో స్రవంతి ఒకరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు టర్న్ తీసుకుంది. సినీ తారలను ఇంటర్వ్యూలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది. `పుష్ప 1` రిలీజ్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో `ఏంటి సామీ హిట్ కొట్టిండవు పార్టీ లేదా..` అంటూ రాయలసీమ యాసలో మాట్లాడి ఏకంగా అల్లు అర్జున్‌నే షాక్ అయ్యేలా చేసింది. ఈ ఇంటర్వ్యూ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ దెబ్బతో స్రవంతి టాలీవుడ్ లో బిజీ యాంకర్ గా దూసుకుపోతోంది. సినిమా ఈవెంట్స్ కు సుమ తర్వాత మోస్ట్ వాంటెడ్ గా మారింది.
అలాగే గ్లామర్ పరంగా హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్న స్రవంతి.. గత రాత్రి హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొంది. సింపుల్ శారీ హెవీ జ్యువెలరీతో ట్రెడిషనల్ గా స్రవంతి దర్శనమిచ్చింది. ఆమె లుక్ కు చాలా మంది ఫిదా అయ్యారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.
గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఎదురుపడిన స్రవంతి.. ఆయనతో ఫోటో దిగింది. ఈ క్రమంలో ` చీర చాలా బాగుంది, బాగుంది, అందంగా ఉన్నారని` అల్లు అర్జున్ స్వయంగా కాంప్లిమెంట్ ఇవ్వడంతో.. స్రవంతి భూమ్మీద నిలబడలేకపోయింది. ఆనందంతో గాల్లో తేలిపోయింది. అంతేకాదు.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోపంచుకున్న స్రవంతి `మనం ఎంతగానో ఇష్టపడే హీరో మనం కట్టుకున్న చీర చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా` అంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. ప్రస్తుతం స్రవంతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.