అవినీతి పరులపై చర్యలకు మీన మేషాలు లెక్కిస్తున్న న్యూజిలాండ్ తెలుగుదేశం విభాగం

admin
Published by Admin — August 20, 2025 in Politics

గత రెండు వారాలుగా తెలుగు దేశం వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న బంగారుబాలయ్య-బసవ తారకం ఈవెంట్ ప్లాన్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

అశ్విన్ అట్లూరి మరియు టీడీపీ హెడ్ ఆఫీస్‌లోని ఒక సీనియర్ నాయకుడు కలిసి, గత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు సందర్బంగా న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో, న్యూజిలాండ్ టీడీపీలోని కొంతమందితో కలిసి ఈవెంట్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ పథకంతో కొన్ని కోట్ల రూపాయలు వెనుక పెట్టుకోవాలని సూత్రధారులు భావించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇందులో భాగంగా, నందమూరి రామకృష్ణ గారిని ఈ ప్రోగ్రాం కోసం ఒప్పించే బాధ్యత ఆయనమీద పెట్టారు. రామకృష్ణ గారు వారి ప్లాన్ గురించి తెలియక, హాస్పిటల్ కోసం ఫండ్ వస్తుంది కాబట్టి అని వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ల ట్రాప్‌లో పడినట్లు తెలుస్తోంది.

నందమూరి రామకృష్ణ గారిని ఇలావుండే విధంగా ఉపయోగించుకోవాలనుకోవడం, వారి దుర్మార్గానికి పరాకాష్ట మరియు బాధాకరం.

ఈవెంట్ పూర్తి చేసిన తర్వాత కొంత హాస్పిటల్‌కు ఇచ్చి, మిగతాను వ్యక్తిగతంగా ఉపయోగించుకుందాం అనుకున్న వాళ్లకు బాలకృష్ణ గారు పెద్ద బ్రేక్ వేశారు. అయితే, ఈ సొ-కాల్డ్ వీరాభిమానులు, దొంగలుగా ప్రవర్తిస్తూ భుజాలు తడుముకొని వీడియో మెసేజెస్ చేస్తూ బయటపడ్డారు.

ఇప్పుడు పరిచయమైన శాసనసభ్యుల ద్వారా ఆ పోస్ట్ తీసివేయాలని బాలకృష్ణ గారి మీద ఒత్తిడి ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలకృష్ణ గారు ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టి, వీళ్లకు ఇబ్బంది ఏర్పడుతోంది.

ప్రస్తుతం, ఆ పోస్ట్ తీసివేసే ఉద్దేశం బాలకృష్ణ గారికి లేకపోవడంతో, వారు నిరాశతో “లీగల్ ఏక్షన్ తీసుకుంటాము” అని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మీద లీగల్ ఏక్షన్ తీసుకోవాలో తెలియక, తలనొప్పి పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే, న్యూజిలాండ్ టీడీపీ కార్యవర్గం ఇంతవరకు స్పందించకపోవడం, ఎవరు ఇందులో భాగస్వామ్యం ఉన్నారో బయటకు రావాల్సిన అవసరం ఉంది.

ఏది ఏమైనా, ఎంతో మంచి పేరు, ప్రతిష్ఠలున్న న్యూజిలాండ్ తెలుగుదేశం విభాగం ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం బాధాకరం.

Tags
న్యూజిలాండ్ తెలుగు దేశం బంగారుబాలయ్య బసవ తారకం నందమూరి రామకృష్ణ నందమూరి బాలకృష్ణ తెలుగు రాజకీయాలు
Recent Comments
Leave a Comment

Related News