విజయ్‌తోనే ఉంటా.. భార్య సంగీత షాకింగ్ ట్విస్ట్!

admin
Published by Admin — March 07, 2026 in Movies
News Image

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్లుగా విజయ్-సంగీత దంపతుల మధ్య విబేధాలు ఉన్నాయని, వారు విడిపోతున్నారని వస్తున్న వార్తలకు ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపు తగిలింది. తాజాగా సంగీత కోర్టులో వేసిన పిటిషన్ చూసి సినీ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి.

సాధారణంగా విడాకుల పిటిషన్ వేసిన తర్వాత దంపతులు ఒకరికొకరు దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, సంగీత మాత్రం ఇందుకు భిన్నంగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గత నెల 24న చెంగల్పట్టు కోర్టులో విజయ్ నుంచి విడాకులు కావాలని పిటిషన్ వేసిన ఆమె, ఇప్పుడు మరో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు తాను విజయ్‌(Vijay)తోనే ఉంటానని, ఆయన ఇంట్లోనే నివసించేందుకు అనుమతి కావాలని కోరడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగీత(Sangeetha), కేవలం ఈ కేసు కోసమే చెన్నైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే, వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి ఒక ప్రముఖ నటితో విజయ్‌కు ఉన్న సంబంధమే కారణమని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. 2021లో మొదలైన ఈ వివాదం చివరకు విడాకుల వరకు దారితీసింది. అయినప్పటికీ, చట్టపరమైన ప్రక్రియ ముగిసే వరకు భర్త చెంతనే ఉండాలని ఆమె పట్టుబట్టడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో అర్థంకాని ప‌రిస్థితి. అయితే ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఏప్రిల్ 20న జరిగే విచారణకు విజయ్ స్వయంగా హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది.

Tags
Thalapathy Vijay Vijay Sangeetha TVK Sangeetha Vijay Kollywood Vijay Divorce Case
Recent Comments
Leave a Comment

Related News