రఘురామ కేసులో ఐపీఎస్ సునీల్ ఏం చెప్పారు?

admin
Published by Admin — March 08, 2026 in Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(assembly) ఉప సభాపతి కె. రఘురామక్రిష్ణ రాజు(raghuramakrishnaraju)ను వైసీపీ(ycp) ప్రభుత్వంలో సీఐడీ(cid) కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి. హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్(ips officer sunil naik). నాటి ఎంపీ.. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి.. హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో సునీల్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం విచారణకు వేదికగా మారింది గుంటూరు సీసీఎస్ కార్యాలయం. ఈ సందర్భంగా సునీల్ ను విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐదు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నల్ని ఆయన ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. తనను అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణిలోనే సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఐదు గంటల విచారణలో అత్యధికం కేసుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైనే ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు.

వీలైనంతవరకు అసంపూర్తిగా.. మరికొన్నింటికి దాటవేత ధోరణితో సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పొడిపొడిగా సమాధానాలు ఇవ్వటం.. కీలకమైన ప్రశ్నలకు దాటవేతకు సునీల్ ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 9.55 గంటల ప్రాంతంలో గుంటూరు సీసీఎస్ కు చేరుకున్నసునీల్.. ుదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు  విచారణ సాగింది. మధ్యాహ్నం భోజనం కోసం గంట పాటు బ్రేక్ ఇచ్చారు.

తన భోజనాన్ని తానే ఏర్పాటు చేసుకున్నారు సునీల్. ఇదిలా ఉండగా సునీల్ తన వెంట తెచ్చుకున్న లాయర్లను విచారణ అధికారులు అనుమతించలేదు. ఈ మొత్తం ప్రక్రియను వీడియోగా తీశారు. మరో నాలుగు రోజులు సునీల్ విచారణ సాగనుంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలను చూస్తే..

-  బిహార్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై ఎప్పుడొచ్చారు?
-  సీఐడీలో డీఐజీగా ఎప్పుడు చేరారు?
-  ఎవరి ఫిర్యాదు మేరకు రఘురామపై కేసు నమోదు చేశారు?

-  రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించిన తర్వాత అక్కడకు వైద్యుల్నిఎందుకు పిలిపించారు?
-  ఈ కేసును దర్యాప్తు చేస్తుంటే మీ ప్రమేయం వెలుగు చూసింది. అందుకే మిమ్మల్ని నిందితుడిగా చేర్చాం (కేసు కట్టినప్పుడు తన పేరు లేదంటూ సునీల్ అడిగిన నేపథ్యంలో ఈ సమాధానం విచారణ అధికారుల నుంచి వచ్చింది)
-   బిహార్ క్యాడర్ కు చెందిన మీరు వైసీపీ హయాంలో ఏ అవసరంతో ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చారు?
-  ఏపీకి డిప్యుటేషన్ మీద రావటానికి మీకెవరు సహకరించారు?
-  మీరు ఏపీకి రావటం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు?
-  ఏపీ సీఐడీలో డీఐజీగా వ్యవహరించిన మీరు నిర్వర్తించిన విధులు ఏంటి?
-  ఈ విభాగంలో పోస్టింగ్ కోసం ఎవరితోనైనా సిఫార్సు చేయించారా?
-  రఘురామను అరెస్టు చేసి.. సీఐడీ కస్టడీలో ఉంచిన రోజు రాత్రి ప్రత్యేకంగా వైద్యులను ఎందుకు పిలిపించారు?
 -  ఎవర్ని అరెస్టు చేసినా.. ఇలాగే వైద్యుల్ని పిలిపిస్తారా?

Tags
Deputy Speaker Raghurama Krishnam Raju Custodial Torture Case ips sunil naik statement
Recent Comments
Leave a Comment

Related News