బే ఏరియాలో AIA ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఆ వేడుకలు..గ్రాండ్ సక్సెస్

admin
Published by Admin — March 19, 2026 in Nri
News Image
కాలిఫోర్నియాలోని సాన్ జోస్ డౌన్‌టౌన్‌( డిస్కవరీ మెడోలో) లో ఇండో అమెరికన్స్ అసోసియేషన్ (AIA), బాలీ 92.3ల ఆధ్వర్యంలో హోలీ ఫెస్ట్ ఘనంగా జరిగింది. బే ఏరియాలో మొదటిసారిగా జరిగిన ఈ ఈవెంట్‌ లో 50కి పైగా భారతీయ సంస్థలు పాల్గొని మద్దతిచ్చాయి. మార్చి 7వ తేదీన శనివారం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అంగరంగవైభవంగా ఈ వేడుకలు జరిగాయి. రోజంతా 15,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఒకరిపై ఒకరు హోలీ రంగులు చల్లుకోవడం, సంగీతం, నృత్యం, భారతీయ వంటకాలు, బాలీవుడ్ పాటలతో కూడా ఆహ్లాదకర వాతావరణాన్ని ఆహూతులు ఆస్వాదించారు. ఆనందం, మజా, మస్తీతో కూడిన ఈ ఈవెంట్ లో పిల్లలు, పెద్దలు అందరూ ఆనందంగా తమ సమయాన్ని గడిపారు.

స్పాన్సర్లు:

గ్రాండ్ స్పాన్సర్: సంజీవ్ గుప్తా CPA
ప్లాటినం స్పాన్సర్: రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెల్ పార్టనర్: ట్రావెలోపాడ్
పవర్డ్ బై: రియల్టర్ నాగరాజ్ అన్నయ్య
మంత్ర ఇండియా, చాట్ భవన్ (ఫుడ్ స్పాన్సర్లు) ఇతర స్పాన్సర్లు: ఇన్‌స్టా సర్వీస్, అజాద్ ఫైనాన్షియల్స్, ఏపెక్స్, కావ్య ఫుడ్స్, వాచి సిల్క్స్, మై పర్సు.

ఈ వేడుకల్లో రుచికరమైన భారతీయ వంటకాలు వండి వార్చారు. ఫుడ్ బూత్‌ల దగ్గర ఆహూతులు క్యూ కట్టారు. రాధా-కృష్ణుల మధ్య శాశ్వతమైన దైవిక ప్రేమను, చెడుపై మంచి సాధించిన విజయాన్ని, వసంత ఋతువు రాకను, శీతాకాలం ముగింపును హోలీ సూచిస్తుంది. ఆహూతులందరికీ అతిథులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని కాపాడటంలో AIA చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ వేడుకలు చూస్తుంటే అమెరికాలో కాదు భారత్‌లో ఉన్నట్లు అనిపించిందని AIA టీమ్‌ను అభినందించారు

కాంగ్రెస్‌మన్ సామ్ లిస్కార్డో, అసెంబ్లీ మెంబర్ అష్ కల్రా, ఫ్రెమాంట్ మేయర్ రాజ్ సల్వాన్, కాంగ్రెస్‌మన్ రో ఖన్నా కార్యాలయం నుండి టామ్ పైక్, సాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్ బెట్టీ డువాంగ్, సాన్ జోస్, డౌన్‌టౌన్ అసోసియేషన్ CEO బ్రియాన్ కర్ట్జ్, సన్నీవేల్ సిటీ కౌన్సిల్ మెంబర్ మురళి శ్రీనివాసన్, ఫ్రెమాంట్ సిటీ కౌన్సిల్ మెంబర్ యాంగ్ షావో, సాన్ జోస్ సిటీ కౌన్సిల్ మెంబర్లు డొమింగో కాండెలాస్, బియెన్ డోన్, డేవిడ్ కోహెన్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల నుండి 50కి పైగా సంస్థలు సహకరించి ఈవెంట్‌ను విజయవంతం చేశాయి. ఆ సంస్థలతోపాటు స్పాన్సర్లకు, కష్టపడి పనిచేసిన వాలంటీర్లకు AIA హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.

అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి భారతీయ సంస్కృతి, వారసత్వం గురించి చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఒక చక్కని వేదికను అందిస్తున్న ఎన్ జీవో. సభ్యుల మధ్య సాంస్కృతిక మరియు సామాజిక పరిచయాలను ప్రోత్సహించడం  AIA లక్ష్యం. భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహించడం, భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సంస్కృతిని సభ్యలతో పంచుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు.
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
AIA Holi celebrations California bay area
Recent Comments
Leave a Comment

Related News