ఆ పుకార్ల‌కు ఎండ్ కార్డ్ వేసిన శోభిత‌..!

admin
Published by Admin — March 20, 2026 in Movies
News Image

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ నాగచైతన్య(Naga Chaitanya) - శోభిత ధూళిపాళ్ల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. 2024 డిసెంబర్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వరుసగా ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేశారు. అయితే, ఇటీవల జరిగిన కొన్ని మెగా ఫంక్షన్లలో చైతన్య ఒక్కడే కనిపించడంతో నెటిజన్ల బుర్రలకు పని పడింది. ముఖ్యంగా అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్,  విజయ్ దేవరకొండ-రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ వంటి పెద్ద ఈవెంట్లలో శోభిత కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

మిగతా హీరోలైన రామ్ చరణ్(Ram Charan), రానా, నాని వంటి వారు తమ సతీసమేతంగా ఫంక్షన్లకు హాజరవుతుంటే, చైతూ మాత్రం ఒంటరిగా రావడంతో.. శోభిత ప్రెగ్నెంట్ అయ్యారా? అందుకే బయటకు రావడం లేదా?`` అంటూ రూమర్లు గట్టిగా వినిపించాయి. ఏ నోట విన్నా శోభిత గుడ్ న్యూస్ చెప్పబోతోందనే వార్తలే వైరల్ అయ్యాయి. అయితే, ఈ పుకార్లపై అటు చైతన్య కానీ, ఇటు శోభిత కానీ ఎక్కడా నోరు విప్పలేదు. కానీ, తాజాగా ఆమె ఇచ్చిన విజువల్ ట్రీట్ ఆ రూమర్లన్నింటినీ పటాపంచలు చేసింది.

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకకు తన భర్త చైతన్యతో కలిసి శోభిత(Sobhita) స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమె కట్టుకున్న పల్చటి చీర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బొడ్డు కనిపించేలా అత్యంత గ్లామరస్‌గా తయారై వచ్చిన శోభిత, తన ఫిట్ బాడీని చూపిస్తూ తాను ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఏ ఒక్క మాట మాట్లాడకుండానే, కేవలం తన అప్పియరెన్స్‌తో రూమర్లకు ఎండ్ కార్డ్ వేసింది.

Tags
Sobhita Dhulipala Naga Chaitanya Chay Sobhita Gaddar Film Awards Tollywood Sobhita
Recent Comments
Leave a Comment

Related News