మొనాలిసా పెళ్లితో బిగ్ ట్విస్ట్‌.. భ‌ర్త‌పై పోక్సో కేసు!

admin
Published by Admin — April 10, 2026 in National
News Image

కుంభమేళా ఫోటోలతో సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా(Monalisa) వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి వార్తల్లో నిలిచిన ఈ వైరల్ బ్యూటీ కథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆమె భర్త ఫార్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇటీవలే మోనాలిసా తన ప్రియుడు ఫార్మాన్ ఖాన్‌ను పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ వివాహంపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (NCST) దృష్టి సారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోనాలిసా గిరిజన తెగకు చెందిన యువతి కావడంతో జాతీయ ఎస్టీ కమిషన్ అధికారులు ఆమె వివరాలను సేకరించారు. ఈ క్రమంలో వివాహం జరిగే నాటికి మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్లేనని కమిషన్ గుర్తించింది. చట్టబద్ధంగా పెళ్లికి కావాల్సిన వయసు లేకపోవడంతో, ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని కమిషన్ తేల్చి చెప్పింది.

నిబంధనలకు విరుద్ధంగా మైనర్ బాలికను వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో, NCST ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీసులు ఫార్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. మైనర్ కావడంతో పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్లను చేర్చారు. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో ప్రస్తుతం ఫార్మాన్ ఖాన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. కేసు నమోదు చేసిన మహేశ్వర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఒకప్పుడు తన అందంతో కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలోని చట్టపరమైన వివాదాలతో వార్తల్లో నిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Tags
Monalisa KumbhMela Girl Monalisa Bhosle Farman Khan POCSO Act NCST POCSO Case
Recent Comments
Leave a Comment

Related News