ఆ మంత్రి క‌ష్టం.. ఎవ‌రూ గుర్తించ‌ట్లేదే ..!

admin
Published by Admin — April 16, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో ఒక్కొక్క మంత్రి స్టైలు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది మంత్రులు పనిని ఇష్టంగా భావిస్తూ చాలా ఎంజాయ్ చేసే పరిస్థితిలో కనిపిస్తున్నారు. మరికొందరు పనిలో ఎంజాయ్ చేస్తున్నా సమస్యల విషయంలో మాత్రం వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తోడు ప్రత్యర్థుల నుంచి వచ్చే సూటిపోటి విమర్శలు, గణాంకాలు, లెక్కలు వంటివి కూడా ఇలాంటి మంత్రులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న మంత్రి  నారాయణ(Minister Narayana).

ప్రస్తుతం అమరావతి రాజధాని పనులను అదేవిధంగా రాష్ట్ర పురపాలక, మున్సిపల్ శాఖలను కూడా నారాయణ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆ పనులను నిర్విరామంగా చేయించేందుకు నారాయణ కష్టపడుతున్నారని చెప్పాలి. నిరంతరం అమరావతి పనులను పర్యవేక్షించడంతో పాటు కాంట్రాక్టు సంస్థలను ఎంగేజ్ చేయడంలోనూ మంత్రి నారాయణ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం సమీక్షలు చేస్తున్నారు.

 పనుల తీరును కూడా ఆయన సమీక్షిస్తున్నారు. ఇట్లా అమరావతి(Amaravati)  రాజధాని విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే వైసీపీ నుంచి వస్తున్న విమర్శలను అదే విధంగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించే విషయంలో మంత్రి నారాయణ సతమతమవుతున్నారని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఆయన సబ్జెక్టు ఓరియంటెడ్ నాయకుడే తప్ప స్వతహాగా రాజకీయాల నుంచి రాకపోవడం. దీంతో నారాయణ బలమైన విమర్శలను బలమైన ఎదురుదాడిని చేయలేకపోతున్నారు.

దీంతో అమరావతి విషయంలో వైసిపి(YCP) చేస్తున్న విమర్శలు అదేవిధంగా మావిగన్‌ ప్రకటన వంటి వాటిని బలంగా తిప్పికొట్టే విషయంలో మంత్రి చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి. ఒకరకంగా మంత్రికి క్షణం తీరిక లేని మాట వాస్తవం. ఎందుకంటే ఇటు పొరపాలక శాఖ మంత్రిగా కార్పొరేషన్లు డివిజన్లో పునర్విభజన అంశాన్ని పరిశీలించాలి. మరోవైపు సిఆర్‌డి ఏ బాధ్యతలన్నీ కూడా ఆయనే చూస్తున్న నేపథ్యంలో అమరావతి రాజధాని పనులను పర్యవేక్షించాలి. ఇలా రెండు పక్కల మంత్రి నలిగిపోతున్నారని చెప్పాలి.

దీంతో మంత్రి నారాయణ(Minister Narayana) ఒక విధమైన ఒత్తిడిలో ఉన్నారు. పోనీ అలాగని ఆయనకేమైనా భారీ గ్రాఫ్ పెరుగుతోందా అంటే అది కనిపించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇతర మంత్రులతో పోలిస్తే నారాయణకు పని ఎక్కువగా ఉంది. కానీ ఇదే సమయంలో పేరు తక్కువగా కనిపిస్తోంది అన్నది ఆయన నోటి నుంచి వచ్చిన మాట. అయితే సీఎం చంద్రబాబు దృష్టిలో మంత్రి నారాయణకు మంచి మార్కులు ఉన్నాయి. మంచి పనితీరు కలిగిన మంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు.

Tags
Minister Narayana Amaravati Ap News TDP Ap Politics Andhra Pradesh CM Chandrababu
Recent Comments
Leave a Comment

Related News