కేటీఆర్ పాదయాత్రపై కవిత షాకింగ్ కామెంట్స్

admin
Published by Admin — April 17, 2026 in Andhra
News Image

మాజీ మంత్రి కేటీఆర్(ktr) పై ఆయన సోదరి కవిత(kavita) సందర్భానుసారంగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ త్వరలో చేపట్టబోతున్న పాదయాత్రపై కూడా కవిత ఘాటుగా స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు పాదయాత్రలు చేస్తానంటే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ను నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం వెనుక అర్థమేంటని, ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు.

సామాజిక తెలంగాణే లక్ష్యంగా తాను కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టానని అన్నారు. కాబట్టే తనకు అనేక కష్టాలు వచ్చాయని కవిత అన్నారు. అందరికీ అధికారం అందాలని తాను మాట్లాడటం మొదలుపెట్టాకే నాకు సమస్యలు ఎదురయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసినా, సామాజిక తెలంగాణ సాధించే వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని కవిత పెద్ద బాంబు పేల్చారు.

Tags
kalvakuntla kavita ktr padayatra slams
Recent Comments
Leave a Comment

Related News