ఇరాన్ కు ట్రంప్ షాక్..ఆ విషయంలో తగ్గరట

admin
Published by Admin — April 17, 2026 in International
News Image
ఇజ్రాయెల్, లెబనాన్ ల మధ్య 10 రోజుల సీజ్ ఫైర్ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్(Iran) తెరవడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇక, తమ గ్యాస్ సిలిండర్ కష్టాలకు చెక్ పడినట్లేనని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఇరాన్ కు ట్రంప్(Trump) షాకిచ్చారు. ఇరాన్‌పై తమ నావికా దిగ్బంధం (బ్లాకేడ్) కొనసాగుతుందని ట్రంప్ అన్నారు.

హర్మూజ్ జలసంధి వ్యాపారానికి, పూర్తి రాకపోకలకు సిద్ధంగా ఉన్నందుకు ఇరాన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. అదే సమయంలోఇరాన్‌తో అమెరికా ఒప్పందం 100 శాతం పూర్తయ్యే వరకు సైనిక దిగ్బంధం కొనసాగుతుందన్నారు. చాలా అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, చాలా వేగంగా మిగతా చర్చలు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఇజ్రాయెల్ కు హెజ్బుల్లా వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తే తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించింది. తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చింది.
Tags
Iran Trump War warning harmoz strait
Recent Comments
Leave a Comment

Related News