టాలీవుడ్(Tollywood)లో సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. వరుస పెట్టి అఖండ - వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి - డాకూ మహారాజ్ తో నాలుగు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. భారీ అంచనాలతో వచ్చిన అఖండ 2 - తాండవం సైతం యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా లైన్లో పెడుతున్నాడు.
ఇదిలా ఉంటే బాలయ్య నెక్ట్స్ లైనప్‌లో ఓ అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR)కు రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడితో బాలయ్య సినిమా ఓకే అవ్వుతున్నట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు కొరటాల శివ. కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో 'జనతా గ్యారేజ్' - 'దేవర' రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్లు అయ్యాయి.
దేవర(Devara) సినిమాకు సీక్వెల్‌గా దేవర 2 వస్తుందని అంటున్నా ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్‌తో ఇప్పట్లో దేవర 2 సినిమా పట్టాలు ఎక్కే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే కొరటాల ఈ లోగా బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు కథ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ ప్రకారం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ దాదాపు ఖరారైపోయినట్టే అంటున్నారు. మలినేని గోపీచంద్ - బాలయ్య సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.