ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(jagan) 15 రోజుల వ్యక్తిగత పర్యటన కోసం లండన్(london) వెళ్లిన సంగతి తెలిసిందే. యూకేలో చదువుకుంటున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్ తో పాటు భారతి కూడా యూకే వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ తెల్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంట్ తో కనిపించే జగన్... డెనిమ్ డ్రెస్ లో కనిపించారు. ఇక, లండన్ లో ల్యాండ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బ్లూ కలర్ బ్లేజర్ తో జగన్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.