టీడీపీ(tdp)లో ఒక నవశకం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు నారా లోకేష్ మరో మెట్టు ఎక్కారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్(TDP national working president) గా మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు చేతుల మీదుగా లోకేష్(lokesh) తో పాటు పలువురు నేతలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కాదని... అత్యున్నత బాధ్యత అని ఆయన అన్నారు.
ప్రతిపక్షంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషే. అని పొగడ్తలతో ముంచెత్తారు.
అదే సమయంలో టిడిపి నేతలను ఉద్దేశించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన నేతలు ఎవరైనా సరే పేపర్ల హెడ్ లైన్లోకి వెళ్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.