అన్నగారితో విజయ్ కు పోలికా?..నెవర్!

admin
Published by Admin — May 05, 2026 in National
News Image

తమిళనాడులో టీవీకే అనూహ్య విజయం సాధించడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. సుమారు 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన TVK పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిందని ప్రశంసలు కురుస్తున్నాయి. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ ల తర్వాత ఆ రేంజ్ లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన సినీ నటుడు విజయ్ అని పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, అన్న ఎన్టీఆర్ గెలుపునకు విజయ్ గెలుపునకు పోలిక లేదన్న చర్చ కూడా జరుగుతోంది.

ఢిల్లీ పెద్దల మెడలు వంచేందుకు ప్రాంతీయ పార్టీ స్థాపించడం, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడం అన్నగారికే సాధ్యం. తలలు పండిన కాంగ్రెస్ నేతలను మట్టి కరిపించి ప్రాంతీయ పార్టీల సత్తా ఇది అని చాటి చెప్పారు అన్నగారు. అప్పటి ఎన్నికల ప్రచార సరళి, ప్రసార మాధ్యమాలు...ఇప్పటి జమానాతో పోల్చడం సరికాదు. అన్నగారి జమానాలో దినపత్రిక, రేడియో..కొన్ని చోట్ల టీవీలు మినహా వేరే ప్రసార మాధ్యమాలు లేవు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా అంటూ అరచేతిలో వార్తలు అరక్షణంలో వచ్చేస్తున్నాయి. ఇక, ఓ సాధారణ వ్యాన్ (చైతన్య రథం) లో అన్నగారు అవిశ్రాంతంగా రాష్ట్రం నలుమూలలా సునామీలా పర్యటించారు. అప్పట్లో అన్నగారు చేసినన్ని ప్రసంగాలు, నిర్వహించిన సభలు మరే నాయకుడు చేయలేదంటే అతిశయోక్తి కాదు. కానీ, ఇప్పుడు విజయ్ అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో వాహనాలు, కాన్వాయ్, మందీ మార్బలంతో పర్యటనలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన అన్నగారు తన కుమారులు బాలకృష్ణ, రామకృష్ణల వివాహానికి కూడా హాజరు కాలేదంటే అన్నగారి అంకిత భావం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఇక, టీడీపీ కేవలం 9 నెలల కాలంలోనే మూడింట రెండు వంతులకు పైగా మెజారిటీతో అధికారం దక్కించుకుంది. అదే సమయంలో రెండేళ్ల సమయంలో మెజారిటీకి 10 సీట్ల దూరంలో విజయ్ పార్టీ టీవీకే ఆగిపోయింది. అయితే, విజయ్ గెలుపును తక్కువ చేయడం లేదు. కానీ, అన్నగారి గెలుపుతో పోొల్చడం సరికాదు. భారత దేశ రాజకీయ చరిత్రలో అన్నగారి గెలుపు మరెవ్వరికీ రాదు..రాబోదు.

Tags
Ntr mgr vijay Tvk no comparison
Recent Comments
Leave a Comment

Related News