సీఎం చివరి సినిమాకు యమ క్రేజ్

admin
Published by Admin — May 13, 2026 in Movies
News Image
కొన్ని వారాలు వెనక్కి వెళ్తే ‘జననాయకుడు’ సినిమా పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో గుర్తుండే ఉంటుంది. అసలే సెన్సార్ సమస్యలతో నెలల తరబడి సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఎప్పుడు రిలీజవుతుందో తెలియని పరిస్థితుల్లో సినిమా మొత్తం ఆన్ లైన్లో లీక్ అయిపోవడంతో నిర్మాత బాధ వర్ణనాతీతం.
 
సంక్రాంతి రిలీజ్ వాయిదా పడడం వల్ల అప్పటికే బయ్యర్లలో చాలామంది వెనక్కి తగ్గితే.. ఈ లీక్ దెబ్బకు డ్యామేజ్ మరింత పెరిగింది. బయ్యర్లందరూ చేతులెత్తేయడమే కాక.. అంతకుముందు చేసుకున్న డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ నుంచి అమేజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గింది. రూ.120 కోట్లు పలికిన హక్కులకు తర్వాత సగమైనా వస్తావా రావా అని సందేహాలు నెలకొన్న పరిస్థితి. రెండు వారాల ముందు జీ5 వాళ్లు రూ.50 కోట్లకు హక్కులు అడుగుతున్నట్లు, అలాంటి డీల్ దొరకడమే గొప్ప అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ‘జననాయగన్’ను ప్రొడ్యూస్ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కె.నారాయణ దీనికి లొంగలేదు. ఎన్నికల ఫలితాలు వస్తే అంతా మారుతుందని ఎదురు చూశారు.
 
ఆయన అంచనా వేసినట్లే.. ఇప్పుడు ‘జననాగయన్’కు పోయిన క్రేజ్ అంతా తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. విజయ్ ఎన్నికల్లో అద్భుత విజయంతో ఏకంగా సీఎం కుర్చీలో కూర్చోవడంతో ఆయన చివరి చిత్రానికి ఎక్కడ లేని డిమాండ్ కనిపిస్తోంది. పైరసీ వెర్షన్ రిలీజ్ అయినా అదేం పెద్ద ఇబ్బంది కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల చివరి వారంలో ‘జననాయగన్’ను రిలీజ్ చేయాలని చూస్తుండగా.. బయ్యర్ల నుంచి మళ్లీ ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
 
సీఎం విజయ్ చివరి చిత్రాన్ని థియేటర్లలో సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ మామూలు ఉత్సాహంతో లేరు. సామాన్య ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని బాగానే ఆదరించేలా కనిపిస్తున్నారు. ఇంకోవైపు ‘జననాయగన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం డిమాండ్ గతంలో కంటే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇంతకుముందు అనుకున్న రేంజిలోనే డీల్ ఓకే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్ ఓటీటీ ప్లేయర్లు హక్కుల కోసం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags
jananayagan movie hero vijay cm vijay super craze release
Recent Comments
Leave a Comment

Related News