కువైట్ లో ఘనంగా మహానాడు వేడుకలు

admin
Published by Admin — May 17, 2026 in Nri
News Image

కువైట్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా NRITDP Kuwait ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం అత్యంత ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. తెలుగు జాతి గర్వకారణం, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి ఆశయాలను స్మరించుకుంటూ, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి సంఘీభావం తెలుపుతూ ఈ మహానాడు వేడుకలను కువైట్‌లోని తెలుగుదేశం కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

కువైట్‌లోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొని ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ప్రారంభంలో ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ స్థాపకుని ఆశయాలు, తెలుగుదేశం పార్టీ చరిత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు హాజరై మహానాడు కార్యక్రమాన్ని మరింత గౌరవప్రదంగా తీర్చిదిద్దారు. అలాగే ప్రముఖ నాయకులు అనిమిని రవి నాయుడు,సుగవాసి ప్రసాద్ బాబు, రమేష్ నాయుడు, వెంకట్ కోడూరి తదితరులు పాల్గొన్నారు.

అలాగే NRITDP కువైట్ నాయకులు ఉదయ్ ప్రకాశ్ , ఓలేటి దివాకర్, రాచూరి మోహన్, ముస్తాక్ ఖాన్, ఓలేటి రెడ్డయ్య చౌదరి, Dr కృష్ణ చైతన్య, నారాయణమ్మ, తెలుగు యువత మురళి దుగ్గినేని, కొల్లపమని రమేష్ ,తదితరులు పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ హృదయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొట్టుకుంటుందని తెలిపారు.

ఈ మహానాడు కార్యక్రమంలో వెంకట్ కోడూరు గారు మాట్లాడిన మాటలు కార్యకర్తల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపాయి.

ఆయన మాట్లాడుతూ —

“తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదు… అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక. ఆ ఆత్మగౌరవానికి పునాది వేసింది మహానటుడు, మహానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన కలలను నెరవేర్చే బాధ్యతను ఈ రోజు ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్” అని పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానం, నిబద్ధత తగ్గదని, కువైట్‌లోని ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

“మనం విదేశాల్లో ఉన్నామనే మాట నిజం… కానీ మన హృదయం మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొట్టుకుంటోంది. తెలుగుదేశం జెండా ఎక్కడ పడితే అక్కడ ఎగురుతుంది… ఎందుకంటే అది ఒక పార్టీ జెండా మాత్రమే కాదు, అది తెలుగు ప్రజల గౌరవానికి ప్రతీక. ఎవరైనా ఆ గౌరవాన్ని తక్కువ చేసి చూడాలని ప్రయత్నిస్తే… అక్కడే తెలుగుదేశం కార్యకర్త నిలబడతాడు.” అని ఘాటుగా పేర్కొన్నారు.

అలాగే ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న NRITDP కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి అండగా నిలుస్తారని, పార్టీ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ముందుంటారని తెలిపారు.

మహానాడు సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, విదేశాల్లోని తెలుగు ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిపారు. పార్టీ మరింత బలోపేతం కావాలని, నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పలు తీర్మానాలు చేశారు.

NRITDP కువైట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహానాడు కార్యక్రమం కువైట్‌లోని తెలుగు ప్రజల ఐక్యతను, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

మహానాడు ముఖ్య అతిథి గౌరవనీయులు ఎన్.అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ

విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఒక్కటిగా చేరడం చాలా ఆనందంగా ఉంది. కువైట్‌లోని NRITDP కార్యకర్తలు చూపిస్తున్న ఐక్యత చూస్తే పార్టీపై వారి ప్రేమ ఎంత ఉందో అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ. అదే స్పూర్తితో మనందరం ముందుకు సాగాలి” అని అన్నారు.

కువైట్‌లోని NRITDP కార్యకర్తలు చూపిస్తున్న చైతన్యం చూస్తే తెలుగుదేశం పార్టీ శక్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది” అని అన్నారు. కువైట్ లో జరిగిన మహానాడు కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన శాప్ చైర్మన్ రవి నాయుడు గారికి కువైట్లో చిరకాలంగా ఉన్నటువంటి ప్రధాన సమస్య రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించాలని మహానాడు కార్యనిర్వాహకులు విజ్ఞప్తి చేశారు ఆయన సానుకూలంగా స్పందించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడటం జరిగింది మాట్లాడిన కొన్ని గంటల్లోనే వీలైనంత త్వరగా కువైట్ నుంచి రేణిగుంట కివిమానాలను ఏర్పాటు చేస్తామని అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పటం ఎంతో సభ్యులు ఆనందంతో హర్షాతిరేకలు వ్యక్తం చేశారు

సుండుపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ రమేష్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోట్లాది తెలుగు ప్రజల ఆశల ప్రతీక. ఈ పార్టీ పుట్టింది ప్రజల గౌరవం కోసం, అభివృద్ధి కోసం. ఆ బాటలోనే ఈ రోజు కూడా పార్టీ ముందుకు సాగుతోంది అని అన్నారు.

మహానాడు సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట సభలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఆయన తన ప్రసంగాన్ని భావోద్వేగంతో ప్రారంభిస్తూ ఇలా అన్నారు 

“నాకు తెలుగుదేశం పార్టీ అనేది కొత్తగా వచ్చినది కాదు… ఇది మా ఇంటి రక్తంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నా తండ్రి స్వర్గీయ శ్రీ పాలకొండ్రాయుడు గారు తన ఆఖరి శ్వాస వరకు పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం, సిద్ధాంతాల కోసం జీవించిన వ్యక్తి ఆయన.

ఆయన చూపిన బాటలోనే నేను కూడా ఈ రోజు ముందుకు సాగుతున్నాను. ఆయన వారసత్వం నాకు బాధ్యత… అదే నా గర్వం.” అని తెలిపారు.

అంతేకాకుండా ఆయన ఊర మాస్ స్థాయిలో మాట్లాడుతూ 

“తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక పార్టీ కాదు… అది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ ఆత్మగౌరవానికి పునాది వేసింది మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు వేసిన బాటలోనే ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నాయకులు బాబు గారు,లోకేష్ గారు .

మీరంతా విదేశాల్లో ఉన్నా రు… కానీ మీ గుండెల్లో మాత్రం తెలుగుదేశం జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కువైట్ నేలపై తెలుగుదేశం కార్యకర్తల ఐక్యత చూస్తే గర్వంగా ఉంది.

ఎందుకంటే తెలుగుదేశం అనేది కేవలం రాజకీయ పార్టీ కాదు… అది ఒక ఉద్యమం… అది ఒక గౌరవం… అది తెలుగు జాతి గర్వం.

ఈ రోజుమీరు విదేశాల్లో ఉన్నా… మనం ఎక్కడ ఉన్నా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి —

తెలుగుదేశం పార్టీ గౌరవం అంటే మన గౌరవం… తెలుగుదేశం పార్టీ జెండా అంటే మన ఆత్మగౌరవం.

ఆ జెండా ఎక్కడ ఎగురుతుందో అక్కడ తెలుగు గర్వం నిలబడుతుంది…

ఆ జెండా ఎక్కడ ఉంటుందో అక్కడ తెలుగుదేశం కార్యకర్త గుండె కొట్టుకుంటుంది!” అని ఘాటుగా మాట్లాడుతూ సభలో ఉన్న కార్యకర్తల నుంచి ఘనమైన చప్పట్లను అందుకున్నారు.

అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్‌లోని తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ పట్ల చూపుతున్న ప్రేమ, నిబద్ధత చాలా గొప్పదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా NRITDP కార్యకర్తలు పార్టీ కోసం

ఈ కార్యక్రమము విజయవంతం కావడానికి తెలుగు దేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు , నందమూరి అభిమానులు తోపాటు ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు చుండు రెడ్డయ్య మరియు వారి కార్యవర్గ సభ్యులు 

సుగవాసి ప్రసాద్ బాబు యువసేన. రెడ్డిశేఖర్ మరియు వారి కార్యవర్గం ఏపీ టీడీపీ యూత్ 

మహిళా విభాగం తెలుగు మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ గారు , దేవి చౌదరి గారు, అంజలి గారు,బీసీ విభాగం శంకర్ యాదవ్ వారి కార్యవర్గ సభ్యులు మైనార్టీ విభాగం, రహ్మతుల్లా వారి కమిటీ సభ్యులు కూటమి ..నాయకులు జనసేన పార్టీ కువైట్ అధ్యక్షుడు హరి రాయల్ వారి కార్యవర్గం ఎంతో సహకారం అందించారు కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమము లో పాల్గొన్న తెలుగు వారందరికీ మంచి ఆహారాన్ని అందించిన స్కై స్పైసి రెస్టారెంట్ వారికి కమిటీ వారు కృతజ్ఞతలు తెలిపారు.గత నాలుగు మహానాడు లకు వరుసగా వారు భోజన సదుపాయాలు కల్పించడం వారికి సమాజం పట్ల,పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను తెలియచేస్తుంది అని సీనియర్ నాయకులు వారిని అభినందించి సన్మానం చేశారు.

ఈ కార్యక్రమానికి నక్షత్ర ......., హన్విక........,................ తదితరులు తమ సహకారం అందించారు.వారికి కమిటీ వారు ఘనంగా సన్మానించి వారికి మెమెంటో లు అందచేశారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Nri tdp Kuwait celebrated mahanadu in Grand style
Recent Comments
Leave a Comment

Related News