నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానెల్ `Dino Deets`ఈ రోజు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాయనమ్మ నారా భువనేశ్వరి మనవడు దేవాన్ష్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన ముద్దుల మనవడు దేవాన్ష్ పాడ్ కాస్ట్ ప్రపంచంలోకి బాల పాడ్ కాస్టర్ గా అడుగుపెట్టడం ఆశ్చర్యంగా, సంతోషంగా ఉందని అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన డైనోసార్ల గురించి దేవాన్ష్ ఆత్మ విశ్వాసంతో పాడ్ కాస్ట్ చేయడం, డైనోసార్ల గురించి వివరించడం సంతోషంగా ఉందన్నారు. దేవాన్ష్ మొదటి పాడ్ కాస్ట్ వచ్చే శుక్రవారం విడుదల కాబోతోందని, దానిని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.