తాతకు తగ్గ మనవడు.. ఎనిమిదేళ్లకే దేవాన్ష్ సంచలనం!

admin
Published by Admin — May 17, 2026 in Andhra
News Image

నారా, నందమూరి వంశాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నారా దేవాన్ష్(Nara Devansh) సోషల్ మీడియా వేదికగా సరికొత్త సంచలనానికి తెరలేపారు. కేవలం ఎనిమిదేళ్ల ప్రాయంలోనే అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక వినూత్నమైన అడుగు వేశారు. తాత నారా చంద్రబాబు నాయుడు విజన్, తండ్రి నారా లోకేష్ చొరవను అందిపుచ్చుకున్న దేవాన్ష్.. ఈ చిన్న వయసులోనే డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

సాధారణంగా ఈ వయసు పిల్లలు ఆటపాటల్లోనో, కార్టూన్లు చూడటంలోనో బిజీగా ఉంటారు. కానీ దేవాన్ష్ మాత్రం కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవులపై విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. బెడ్‌రూమ్ నిండా డైనోసార్ల బొమ్మలు, చేతిలో వాటికి సంబంధించిన రీసెర్చ్ పుస్తకాలతో సరికొత్త లోకాన్ని సృష్టించుకున్నారు. అంతటితో ఆగకుండా, తను తెలుసుకున్న విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి "డైనోడీట్స్" (DinoDeets) పేరుతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా ఒక ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ సిరీస్‌ను సిద్ధం చేశారు.

ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన టీజర్‌ను స్వయంగా తండ్రి, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. "రూమంతా డైనోసార్లతో నింపేశావు.. అసలేంటి కథ?" అని లోకేష్ ప్రశ్నించగా.. "నేను వీటిపై రీసెర్చ్ చేస్తున్నా, నా పాడ్‌కాస్ట్ ద్వారా అందరికీ చెప్తా" అంటూ దేవాన్ష్ ఇచ్చిన స్మార్ట్ ఆన్సర్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాతకు తగ్గ మనవడిగా దేవాన్ష్ చూపిస్తున్న ఈ ప్రతిభను చూసి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా మురిసిపోతున్నారు.

వచ్చే శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న ఈ సరికొత్త పాడ్‌కాస్ట్ ప్రయాణానికి తల్లి నారా బ్రాహ్మణి(Nara Brahmani), నాయనమ్మ నారా భువనేశ్వరి ట్విట్టర్ (X) ద్వారా ఆశీస్సులు అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎనిమిదేళ్ల‌కే ఇంతటి పరిణతితో, విజ్ఞానాన్ని పంచేందుకు సిద్ధమైన దేవాన్ష్‌ను చూసి నారా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

https://x.com/naralokesh/status/2055902433054978366?s=20

Tags
Nara Devansh Dino Deets Nara Lokesh Devansh Podcast Chandrababu Naidu Dinosaurs
Recent Comments
Leave a Comment

Related News